హోమ్ / వంటకాలు / సన్న కారపూస

Photo of Chick flour sev by Pravallika Srinivas at BetterButter
719
2
0.0(0)
0

సన్న కారపూస

Nov-03-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సన్న కారపూస రెసిపీ గురించి

హాట్ ఐటెం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కారపూస మురుకులు జంతికలు. కారపూస చాలా త్వరగా ఈజీ గా చేస్కోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 10

  1. శనగపిండి - 1/2 కేజి
  2. బియ్యంపిండి - 1/2 కేజి
  3. ఉప్పు - 2 స్పూను
  4. కారం - 2 స్పూను
  5. వాము - 1 స్పూను
  6. నూనె - తగినంత
  7. నీరు - తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక మిక్సర్ జార్ లో వాము ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  2. ఒక బేసన్ లో శనగపిండి బియ్యంపిండి ఉప్పు కారం వాము పొడి వేసి కలుపుకోవాలి.
  3. ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేడి చేసుకోవాలి.
  4. ఈలోగా కొంచం పిండిలో నీరు పోసి ముద్దలాగా కలుపుకోవాలి.
  5. ఆ పిండిని మర్దన చేస్కుని కొంచం గట్టిగ కలుపుకోవాలి.
  6. ఇప్పుడు చక్రాల గిద్దెలకు నూనె రాసి తయారైన పిండి ముద్దను పొడవుగా చేసి గిద్దెల్లో వేసి కాగిన నూనె లో కారపూస కాడాయికి సరిపడ వత్తుకోవాలి.
  7. ఇప్పుడు మంట తగ్గించి వేగనివ్వాలి చిల్లులగరిటతో మరొక వైపు తిప్పి దోరగా వేయించుకోవాలి.
  8. నూనె లో నురగ ఆగిపోతే కారపూస తెసివేయచ్చు.
  9. ఇప్పుడు మరికొంచం పిండిని నీరుపోసి కలిపి మౌల్డ్ లో పెట్టి మరొకసారి నూనె లో వత్తుకోవాలి.
  10. పిండి మొత్తం అయ్యేవరకు చేసుకోవాలి. అంతే యంతో రుచికరమైన కారపూస రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర