హోమ్ / వంటకాలు / చక్రపొంగలి

Photo of chakkara pongal by Tejaswi Yalamanchi at BetterButter
358
1
0.0(0)
0

చక్రపొంగలి

Nov-08-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చక్రపొంగలి రెసిపీ గురించి

శ్రావణ మాసం మొదలైందంటే చాలు పండగలు, నోములు, వ్రతాలు.. ప్రసాదాలు.. అందరూ బిజీ . బిజీ.. ఒక్కోక్కో పండగకి ఒక్కో నైవేద్య చేసి దేవుళ్ళకు నైవేద్యాలు సమర్పిస్తారు. వచ్చిన అతిథులకు కు అందిస్తారు. మరి ఈ శ్రావణ మాసంలో జరుపుకోనే మహిళలకు అతి ముఖ్యమైన పండుగ వరలక్ష్మీ వత్రం. ఈ పండుగ పర్వదినానా మహాలక్ష్మికి ఇష్టమైన ఓ స్వీట్ ను నైవేద్యంగా సమర్పిస్తాం. ఆ స్వీట్ ఏటంటే??చాలా త్వరగా తయారయ్యే రుచికరమైన స్వీట్ చక్రపొంగలి. ఇది దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. అన్నం 1 కప్
  2. పెసరపప్పు 1/2 కప్
  3. నీరు -(1:2) బియ్యం కి ,(1/2:1) పెసరపప్పు కి
  4. నెయ్యి 2 చెంచాలు
  5. జీడిపప్పు 10-12
  6. ఎండు ద్రాక్ష 10-12
  7. కొబ్బరి ముక్కలు 10-12
  8. యాలకులపొడి 1/4 టీస్పూన్

సూచనలు

  1. రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి జీడిపప్పు,ఎండు ద్రాక్ష,కొబ్బరి ముక్కలు వేయించి, పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఇదే నెయ్యిలో పెసరపప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి.
  3. ఇప్పుడు దానిలో బియ్యం వేసి ఒక్క నిమిషం తిప్పాలి.
  4. తర్వాత వేగిన వాటిలో నీరు పోసి ఉడకనివ్వాలి.
  5. అన్నం పెసరపప్పు ఉడికాక.
  6. ఇప్పుడు ఇందులో పంచదార వేసి కలిపి ఉడికించాలి. బాగా దగ్గరయ్యేటప్పుడు యాలకుల పొడి,వేయించిన జీడిపప్పు,ఎండు ద్రక్షలు,కొబ్బరి ముక్కలు వేసి కలిపి దించెయ్యాలి.
  7. వేడి వేడి చక్రపొంగలి సిద్దం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర