హోమ్ / వంటకాలు / మడత కాజాలు

Photo of  kaajaalu by Kavitha Perumareddy at BetterButter
528
0
0.0(0)
0

మడత కాజాలు

Nov-09-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మడత కాజాలు రెసిపీ గురించి

ఈ వంట కు కాకినాడ ప్రసిద్ధి.పైన క్రoచి గా లోపల జ్యూసిగా ఉండి చాలా బాగుంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. మైదా పిండి ఒక కప్
  2. చెక్కర ఒకటిన్నర కప్
  3. నెయ్యి 3 పెద్ద స్పూన్స్
  4. సోడాపొడి పావు స్పున్
  5. ఉప్పు చిటికెడు
  6. యాలకుల పొడి స్పున్
  7. కుంకుమపువ్వు చిటికెడు
  8. నిమ్మరసం స్పున్
  9. నూనె డీప్ ప్రై కు సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి ,నెయ్యి,సోడాపోడి,ఉప్పు,వేసి అంతా బాగా కలిసేలా కలపాలి.తరువాత తగినన్ని నీళ్లుపోసుకొని చెపాతి పిండిలా కలుపుకోవాలి.గట్టిగా కలుపుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద గిన్నె పెట్టి చెక్కర ,సగం కప్ నీళ్లుపోసి కాగనివ్వాలి.లేతపాకం రానివ్వాలి.ఈపాకంలో యాలకుల పొడి,కుంకుమపువ్వు, నిమ్మరసం వేసి అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు మైదా పిండిని రెండు భాగాలుగా చేసుకోవాలి.ఒక భాగం తీసుకొని పెద్ద చెపాతి లాగా ఒత్తుకోవాలి.మూడు వైపులా కట్ చేసుకొని ముక్కలు లోపల పెట్టుకోవాలి .కింద చూపిన విధంగా .
  4. అంతా సమానంగా ఒత్తుకోవాలి.ఇప్పుడు దాని పైన పొడి మైదా అంతా బాగా చల్లుకోవాలి .పైన పిక్ లో లాగా .తరువాత ఈ చెపాతి రోల్ చేసుకోవాలి.చివర్లు తడిచేసుకొని అతికించుకోవాలి.సమాన ముక్కలుగా కట్ చేసుకోవాలి.కింద పిక్ లో లాగా.
  5. తరువాత వాటిని నెమ్మదిగా ఒత్తుతూ రోల్ చేసుకోవాలి ఇలాపిక్ లో లా...తరువాత వెంటనే నూనెలో వేసుకోవాలి.ఆలస్యం అవుతే లోపల పూసిన పిండి నానిపోయి పొరలు అతుక్కపోతాయి.అప్పుడు కాజాలు సరిగ్గా పొంగవు.వెంటనే చేసుకోవాలి.
  6. తరువాత స్టవ్ మీద నూనె పెట్టి వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.నూనె మరీ మరిగేంత వేడిగా ఉండకూడదు.ఈ నూనెలో కాజాలు అన్ని వేసుకోవాలి.అవి ఆ వేడికి నిదానంగా కాలుతూ చిన్నగా పైకి లేస్తాయి.
  7. ఇలాకాలుతూ వున్నప్పుడు స్టవ్ అంటించుకొని సిమ్ లో పెట్టాలి.అవి అన్నీ నిదానంగా పొంగుతున్నప్పుడు మంట హైలో పెట్టాలి.ఇలా కింద పిక్ లాగా పొంగుతున్నప్పుడు మంట హైలో పెట్టాలి.
  8. అప్పుడు అన్నీ బాగా ఇలా పొంగుతాయి ఇలా పిక్ లో లాగా ....
  9. ఇప్పుడు వాటిని కలుపుతూ రెండు వైపులా తిప్పుతూ సమానంగా బంగారు రంగులో వేయించుకోవాలి.కాజాలు సగం కాలిన తరువాత మంట తగ్గించి వేయించుకోవాలి .అప్పుడే బాగుంటాయి.లోపల బాగా కాలుతాయి.
  10. తరువాత వాటిని తీసి వెంటనే పాకంలో వేసి గరిటతో ఒత్తుకోవాలి.అప్పుడు పాకం బాగా లోపలికి పీల్చుకుంటుంది. ఇలా అన్నీ చేసుకోవాలి.
  11. తరువాత ఒక ప్లేట్ లో తీసుకోవాలి.ఇవి 10 డేస్ నిలువవుంటాయి.
  12. తరువాత ఇక అందరికీ అందమైన ప్లేట్ లో వడ్డించుకోవాలి.ఇవి వేడి వేడిగా కూడా చాలా బాగుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర