ఫ్రూట్ సలాడ్ | FRUIT SALAD Recipe in Telugu

ద్వారా Sandhya Rani Vutukuri  |  12th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of FRUIT SALAD by Sandhya Rani Vutukuri at BetterButter
ఫ్రూట్ సలాడ్by Sandhya Rani Vutukuri
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  3

  గంటలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

0

0

ఫ్రూట్ సలాడ్ వంటకం

ఫ్రూట్ సలాడ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make FRUIT SALAD Recipe in Telugu )

 • 1 లీ. పాలు
 • 4 చెంచాల కస్టర్డ్ పౌడర్
 • 1 కప్పు చక్కెర
 • 200 గ్రా. మిల్క్ మెయిడ్
 • 1.ఆపిల్
 • 2. అరటిపళ్ళు
 • 6. బాదం గింజలు
 • 6. జిడిపప్పులు
 • గుప్పెడు కిస్మిస్
 • 10 రంగుల టూటిఫ్రూటి(ఆప్షనల్)
 • 2 చెంచాల పాల మీగడ(ఆప్షనల్)

ఫ్రూట్ సలాడ్ | How to make FRUIT SALAD Recipe in Telugu

 1. లీటరు పాలను కలుపుతూ మరిగిస్తూవుండండి.
 2. 4 చెంచాల కస్టర్డ్ పొడి తీసుకోండి.
 3. కాచి చల్లార్చిన ఒక పెద్ద కప్పు పాలల్లో 4 చెంచాల వనిల కస్టర్డ్ పొడి వుండల్లేకుండా కలపండి.
 4. ఈ పేస్ట్ ని సిమ్ లో పెట్టిన మరిగే పాలల్లో కలుపుతూ వుండండి.
 5. ఇప్పుడు 200 గ్రా. మిల్క్ మైడ్ పోసి కలుపుతూ వుండండి.
 6. చక్కెర కూడా కలపండి.
 7. 5 ని.లకే ఈ మిశ్రమం చిక్కబడుతుంది.
 8. ఈ మిశ్రమాన్ని చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టండి. 1గంట తర్వాత మీగడ కట్టిన ఈ పేస్ట్ ని బయటకు తీసి మిక్సీలో వేసి క్రీమ్ వేసి మళ్ళీ ఇంకో గంట ఫ్రిడ్జిలో పెట్టాలి.
 9. ఆపిల్,అరటిపళ్ళు, బాదం, జీడిపప్పు,కిస్మిస్, టూటిఫ్రూటి సన్నగా తరిగి పెట్టుకోండి.
 10. చల్లటి కస్టర్డ్ పైన ముందుగా పండుముక్కలు, ఆపైన డ్రై ఫ్రూట్స్ వేసి అందించండి.

నా చిట్కా:

నల్ల-తెల్ల ద్రాక్ష, నారింజ,దానిమ్మ,పినాపిల్ లాంటివి వేయలనుకుంటే తినే ముందేవేయండి.

Reviews for FRUIT SALAD Recipe in Telugu (0)