హోమ్ / వంటకాలు / మజ్జిగ గారెలు

Photo of Buttermilk wadas by Reena Andavarapu at BetterButter
545
2
0.0(0)
0

మజ్జిగ గారెలు

Nov-13-2018
Reena Andavarapu
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మజ్జిగ గారెలు రెసిపీ గురించి

బైట క్రిస్పీగా లోన మెత్తగా తేలికగా ఉన్న ఆంధ్ర స్పెషల్ మజ్జిగ గారెలు పండగ స్పెషల్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మినప గుళ్ళు ఒక కప్పు
  2. ఉప్పు తగినంత
  3. నూనె వేయించటానికి సరిపడా
  4. పెరుగు 1/2 లీటర్
  5. పోపు వేయడానికి:
  6. ఆవాలు 1/2 స్పూన్
  7. జీలకర్ర 1/2 స్పూన్
  8. ఎండు మిర్చి 2
  9. మిన పప్పు 1 స్పూన్
  10. ఇంగువ చిటికెడు
  11. కరివేపాకు కొంచెం
  12. నూనె 2 స్పూన్లు

సూచనలు

  1. మినప గుళ్ళు రెండు గంటల పాటు సరిపడా నీళ్ళలో నానబెట్టాలి
  2. నానబెట్టిన పప్పు వడపోసి మిక్సీలో కొంచెం నీరు చల్లుకొని మెత్తగా రుబ్బుకోవాలి
  3. తగినంత ఉప్పు వేసి చెయ్యతో ఒకే డైరెక్షన్లో కలుపుతుండాలి.అలా చేస్తే పిండిలో గాలి చేరి వడలు తేలికగా వస్తాయి .
  4. డీప్ ఫ్రై చేయడానికి నూనె వేడి చెయ్యాలి
  5. బాగా వేడి అయ్యేక మంట మీడియం పెట్టి వడలు వెయ్యాలి
  6. చెయ్య నీరుతో తడి చేసుకొని నిమ్మకాయంత ముద్ద తీసుకొని బొట్టన వేలుతో స్ప్రెడ్ చేసి , ఆ బొట్టన వేలుతో కన్నం పెట్టి వేడి నూనె లో వదలాలి
  7. అలా 3 గాని 4 గారెలు ఒక సారి డీప్ ఫ్రై చేయండి
  8. ఒక గిన్నెలో నులివేడి నీళ్లు రెడీ చేసుకొని ఉంచండి .
  9. గారెలు ఆ నీరులో వేసి కనీసం మూడు నిమిషాలు ఉంచాలి
  10. ఈ లోపల మజ్జిగ కోసం పెరుగు పల్చగా చిలుక్కోవాలి . 2 కప్పలు మంచి నీరు వేసి విస్క్ తో రుద్దాలి.
  11. పోపు కోసం 2 స్పూన్ నూనె వేడి చేసి ముందుగా ఆవాలు వేయాలి. తరువాత జీలకర్ర ఇంకా మినప్పప్పు వేసి దోరగా వేయించి కరివేపాకు ,మిరపకాయ ముక్కలు ,ఇంగువ వేసి వేయించాలి.
  12. మజ్జిగలో ఈ పోపు వేసి బాగా కలపాలి .
  13. గారెలు నీరు నుండి తీసి కొంచెము నొక్కి మజ్జిగలో వేసుకోవాలి
  14. అంతే ఎంతో రుచికరమైన మజ్జిగ గారెలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర