హోమ్ / వంటకాలు / పెరుగు పుణుకులు

Photo of Dahi Punugulu by Sudha Badam at BetterButter
623
7
0.0(0)
0

పెరుగు పుణుకులు

Nov-13-2018
Sudha Badam
40 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెరుగు పుణుకులు రెసిపీ గురించి

ఇది ఒక స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. మినపప్పు 1 కప్పు
  2. పెరుగు 1/2 లీటర్
  3. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  4. తాలింపు దినుసులు-మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి
  5. అల్లం అంగుళం ముక్క
  6. పచ్చిమిర్చి 4
  7. కొత్తిమీర చిన్న కప్పు
  8. ఉప్పు తగినంత

సూచనలు

  1. మినపప్పుని 6 గంటలు నానబెట్టుకుని గట్టిగా రుబ్బుకోవాలి.
  2. స్టవ్ మీద మూకుడు పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి నూనె బాగా వేడెక్కాక, రుబ్బిన పిండిలో కొద్దిగా ఉప్పు వేసి చిన్న చిన్న పుణుకులు లాగా నూనె లో డీప్ ఫ్రై చేసుకోవాలి.
  3. చిన్న పాన్ లో 2 స్పూన్లు నూనె వేసి తాళింపు దినుసులు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి వేసి వేగనిచ్చి పక్కన ఉంచుకోవాలి.
  4. పెరుగుని పల్చగా చిలికి దానిలో ఉప్పు, చల్లారిన తాలింపు,కొత్తిమీర వేసి బాగా కలిపి, వేగిన పుణుకులుని ఈ మజ్జిగ లో వేసి మూత పెట్టాలి.
  5. ఈ పుణుకులుని వేడి మీదే మజ్జిగలో వేసుకుంటే, పుణుకులు మజ్జిగని బాగా పీల్చుకుని రుచిగా ఉంటాయి.
  6. సర్వ్ చేసుకునే ముందు కారపూస కానీ బూందీ కానీ జల్లుకుని తింటే బాగుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర