హోమ్ / వంటకాలు / క్యారెట్ రసమలై

Photo of Carrot rasamalai. by Chandrika Marripudi at BetterButter
489
3
0.0(0)
0

క్యారెట్ రసమలై

Nov-17-2018
Chandrika Marripudi
60 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ రసమలై రెసిపీ గురించి

రసమలై ఒక బెంగాలీ తీపి వంటకం.పాలు విరగ్గొట్టి చేసిన ముద్దని చిన్న బిళ్ళలు చేసి పంచదార పాకంలో ఉడికించి చేస్తారు.ఇక్కడ నేను క్యారెట్ తురుము వేసి చేశాను.రంగు,రుచి పరంగా కొంచెం వెరైటీగా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. పాలు : 1 1/2 లీ
  2. పంచదార : 1 కప్
  3. క్యారెట్ : 1(తురుముకోవాలి)
  4. జీడిపప్పు : 10
  5. నెయ్యి : 2స్పూన్లు
  6. నిమ్మకాయ : 1

సూచనలు

  1. ముందుగా ఒక లీటరు పాలు మరిగించి నిమ్మరసం వేసి కలపి పాలను విరగ్గొట్టాలి.
  2. ఒక పలచని బట్టలో విరిగిన పాలను వడకట్టుకోవాలి.
  3. విరుగుడులో చల్లటి నీరు పోసి నీరంతా పోయేలా పిండుకుని ముద్దలా అయేలా చేసుకోవాలి.
  4. రెడీ అయిన పనీర్ ముద్దని చేతితో బాగా మర్దన చేయాలి మెత్తగా అయేవరకు.
  5. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి రెండు అరచేతులు మద్య నొక్కుతూ.
  6. ఒక గిన్నెలో పంచదార వేసి నీళ్ళు పోసి స్టవ్ పైన పెట్టి పంచదార కరిగేలా తిప్పుకోవాలి.
  7. పంచదార కరిగాక రెడీ చేసుకున్న ఉండలు వేసి మూత పెట్టి మీడియం మంటలో 15 నిమిషాలు ఉడికించాలి.
  8. ఉడికాక పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
  9. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి వేయించి అర లీటరు పాలను పోసి కలుపుతూ పాలు దగ్గర పడేంతవరకు మరిగించాలి
  10. ఇపుడు జీడిపప్పు పలుకులు వేసి కలిపి ఇది కూడా చల్లారనివ్వాలి.
  11. చల్లారాక పాకంలో ఉడికించిన బాల్స్ ని చేత్తో వత్తుకుని క్యారెట్ పాల మిశ్రమంలో వేసి ఒక గిన్నెలోకి తీసుకుంటే క్యారెట్ రసమలై రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర