హోమ్ / వంటకాలు / Stuffed heart shape gulabjamoons

Photo of Stuffed heart shape gulabjamoons by Pravallika Srinivas at BetterButter
538
5
0.0(0)
0

Stuffed heart shape gulabjamoons

Nov-17-2018
Pravallika Srinivas
180 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • మిళితం
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. పాలు -అర లీటర్
  2. పంచదార - 1/2 కేజీ
  3. వెనిల్ల ఎసెన్స్- 3 చుక్కలు
  4. గులాబ్ జామ్ పొడి-500 గ్రాములు
  5. యాలుకల పొడి -1/2 స్పూను
  6. నీరు - తగినంత
  7. నెయ్యి - తగినంత
  8. నూనె - తగినంత
  9. నిమ్మరసం - 1

సూచనలు

  1. ముందుగా పాలను కాచి పెట్టుకోవాలి.అందులో కొన్ని పాలను పిండి కలపడానికి పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు మారుగుతున్న పాలలో కొంచం నిమ్మరసం వేసుకోవాలి.పాలు విరగడం మొదలు పెట్టగానే కలపడం ఆపాలి .పూర్తిగా విరిగిపోయాక ఒక గుడ్డ లో వేసి వడగట్టు కోవాలి.
  3. పైన మరి కొంచం నీరు వేసి కడగాలి.బట్టను బాగా పిండి దాని మీద బరువు పెట్టుకోవాలి.లేదంటే బాగా పిండుకోవాలి.
  4. ఇప్పుడు తయారైన పన్నీర్ ని ఒక గిన్నీలో వేసి 2 స్పూన్ల పంచదార,వనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి.స్టూఫిన్గ్ సిద్ధం.
  5. ఇప్పుడు గులాబ్ జామ్ పొడి లో ముందుగా ఉంచిన పాలు పోసి ముద్దలాగా కలుపుకోవాలి.
  6. పిండి మీద తడి గుడ్డ కప్పి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  7. ఆ తర్వాత పిండిని బాగా మర్దన చేసి కొంచం ఉందా తీసుకుని మందంగా వత్తుకుని హార్ట్ షేప్ కట్టర్ తో కట్ చేసుకోవాలి.
  8. అన్నిటిని అలా తయారు చేసుకోవాలి.అంచులు పగుళ్లు లేకుండా స్మూత్గా ఉండేట్టు చూసుకోవాలి.
  9. నెయ్యి నూనె కలిపి కడాయిలో వేసి కరగానిచ్చి గులాబీజామ్ హార్ట్స్ ను డీప్ ఫ్రై చేసుకోవాలి.
  10. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్ లో తీస్కోవాలి.
  11. మరొక స్టవ్ మీద పంచదార, నీరు కలిపి తీగ పాకం రనివ్వాలి.చివరిగా యాలుకలపొడి వేసి కలుపుకోవాలి.
  12. ఇప్పుడు తయారైన హార్ట్స్ ను మధ్యలోకి కట్ చేసుకుని ముందుగా సిద్ధం చేసిన పనీర్ స్వీట్ ని స్టఫ్ చేసుకోవాలి.
  13. అన్ని హార్ట్ గులబ్ జాముల్ని స్టఫ్ చేసుకుని ఒక గుంతగా ఉన్న గిన్నీలో పరుచుకోవాలి.
  14. పైనుండి వేడి పంచదార పాకం వేసి మూత పెట్టి 3 గంటలు పక్కన పెట్టుకోవాలి.
  15. అంతేయ్ యంతో రుచికరమైన హార్ట్ స్టిఫ్ఫ్డ్ గులాబ్ జామున్లు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర