వెజిటబుల్ రైస్ | Vegetable Rice Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  19th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Vegetable Rice recipe in Telugu,వెజిటబుల్ రైస్, Sudha Badam
వెజిటబుల్ రైస్by Sudha Badam
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

వెజిటబుల్ రైస్ వంటకం

వెజిటబుల్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vegetable Rice Recipe in Telugu )

  • బాస్మతి రైస్ 300 గ్రాములు
  • ఏలకులు 3
  • లవంగాలు 5
  • దాల్చిన చెక్క 1/2 అంగుళం ముక్క
  • బిర్యానీ ఆకు
  • షాజీరా 1/2 స్పూను
  • నూనె 5 స్పూన్లు
  • నెయ్యి 1 స్పూను
  • ఉల్లిపాయ 1
  • క్యారెట్ 1
  • బంగాళదుంప 1
  • గ్రీన్ పీస్ గుప్పెడు
  • కాలీఫ్లవర్ 1/2 కప్పు
  • క్యాప్సికమ్ 1
  • పచ్చిమిర్చి 3
  • కొత్తిమీర కొద్దిగా
  • ఉల్లి కాడలు 1/2 కప్పు
  • ఉప్పు తగినంత
  • నిమ్మకాయ 1/2 చెక్క

వెజిటబుల్ రైస్ | How to make Vegetable Rice Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో రెండు స్పూన్లు నూనె,ఒక స్పూను నెయ్యి వేసి వేడెక్కాక మసాలా దినుసులు, బిర్యానీ ఆకు వేసి వేగనిచ్చి కడిగి ఉంచుకున్న బియ్యాన్ని వేసి ఒక్కసారి వేపాలి.
  2. తరువాత ఉప్పు, నీళ్లు వేసి పొడిపొడిగా అన్నం రెడి చేసుకోవాలి.
  3. కాయగూరలన్ని ఒకే సైజ్ ముక్కలులాగా కట్ చేసుకోవాలి.
  4. పాన్ లో నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి చీలికలు వేసి వేగనిచ్చి కాయగూర ముక్కల్ని ఒక దాని తరువాత ఒకటి వేసి, కొద్దిగా ఉప్పు జల్లి మగ్గనివ్వాలి.
  5. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని ఇందులో వేసి బాగా కలిపి రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.
  6. అరచెక్క నిమ్మకాయ పిండుకుని, స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే వెజిటబుల్ రైస్ రెడి.

నా చిట్కా:

ఇష్టం ఐతేనే నిమ్మకాయ పిండుకోవచ్చు.

Reviews for Vegetable Rice Recipe in Telugu (0)