హోమ్ / వంటకాలు / పాలతాలికలు.

Photo of Pala thalikalu by Chandrika Marripudi at BetterButter
1174
2
0.0(0)
0

పాలతాలికలు.

Nov-19-2018
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలతాలికలు. రెసిపీ గురించి

పాలతాలికలు బియ్యప్పిండి, బెల్లం ముఖ్యంగా వాడి చేసే తీపి వంటకం.ఇది ఆంధ్రా లో పెళ్ళి, పండుగలకు శుభకార్యాలలో ఎక్కువగా చేసుకుంటారు.దీని కోసం ఒక పూట ముందుగా బియ్యం నానపెట్టుకుని వడకట్టి రోట్లో దంచి పిండి చేసేవారు.తాలికలు వత్తుకోవడానికి ప్రత్యేక చిల్లుల మూకుడు ఉంటుంది. అది లేకపోతే జంతికల గొట్టంలో లావు రంధ్రలతో వత్తుకోవచ్చు. .ఇప్పట్లో అంత సమయం లేనపుడు బియ్యం నానపెట్టుకుని మిక్సీ చేసి చేసుకోవచ్చు. లేదా ఇంకా త్వరగా కావాలంటే ఇంట్లో రోజు వాడుకునే పొడిబియ్యప్పిండి వాడి చేసుకోవచ్చు. ఇలా కూడా చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 8

  1. బియ్యప్పిండి : 1/2 కేజీ
  2. మైదా పిండి : 100గ్రా
  3. బెల్లం : 1/2 కేజీ
  4. పాలు : 1లీ
  5. నెయ్యి : 4 స్పూన్లు
  6. యాలకులపొడి : 1 స్పూన్
  7. డ్రైఫ్రూట్స్ : తగినట్లు
  8. ఉప్పు : చిటికెడు
  9. సగ్గుబియ్యం : 100గ్రా

సూచనలు

  1. బియ్యప్పిండి, మైదాపిండి ఒక బాండీలో వేసి స్టవ్ పైన చిన్నమంటలో లైట్ గా వేయించుకోవాలి.
  2. పిండిలో కొద్దిగా పాలు పోసి ఒక అరకప్పు బెల్లం తురుము కలిపి గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి.
  3. వేరే గిన్నెలో అర లీటరు పాలు,లీటరు నీళ్ళు పోసి మరిగించాలి.
  4. కలుపుకున్న ముద్దని కొద్ది కొద్దిగా జంతికల గొట్టంలో పెట్టి మరుగుతున్న నీళ్ళుపాలల్లో మెల్లిగా వత్తుకొని ఉడకనివ్వాలి.
  5. సగ్గుబియ్యం విడిగా గిన్నెలో నీరు పోసి ఉడికించి తాలికలు ఉడికాక అందులో కలుపుకోవాలి.
  6. తరువాత బెల్లం తీసుకుని కొంచెం నీరు పోసి కరిగించి,వడకట్టి ఉడుకుతున్న పాలతాలికల్లో పోయాలి.
  7. స్టవ్ సిమ్ లో పెట్టి మెల్లిగా అంతా కలుపుకోవాలి. యాలకులపొడి,చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి
  8. చివరగా కాచిన మిగిలిన అరలీటరు పాలు పోసి కలిపి నేతిలో వేయించిన డ్రైఫ్రూట్స్,నెయ్యి వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన పాలతాలికలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర