పెసర పప్పు తో హల్వా | Moong daal ka halwa Recipe in Telugu

ద్వారా Shobha.. Vrudhulla  |  19th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Moong daal ka halwa by Shobha.. Vrudhulla at BetterButter
పెసర పప్పు తో హల్వాby Shobha.. Vrudhulla
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

3

0

పెసర పప్పు తో హల్వా వంటకం

పెసర పప్పు తో హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Moong daal ka halwa Recipe in Telugu )

 • పెసరపప్పు ఒక కప్పు
 • పంచదార కప్పున్నర
 • రవ్వ 2 చంచాలు
 • శనగపిండి రెండు చంచాలు
 • నెయ్యి పెద్ద కప్పుడు
 • యాలుకుల పొడి ఒక చెంచా
 • కాజు, కిస్మిస్ , బాదం , పిస్తా అన్ని కలిపి అర కప్పు
 • కేసరి చిటికెడు

పెసర పప్పు తో హల్వా | How to make Moong daal ka halwa Recipe in Telugu

 1. ముందుగా పెసరపప్పు ని 3 ఘంటలు నానబెట్టాలి
 2. 3 గంటలు అయ్యాక మెత్తగా రుబ్బుకోవాలి
 3. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి నెయ్య వేసుకోవాలి
 4. నెయ్యి వేడెక్కేక సన్నని సెగ మీద గోధుమ నూక మరియు శనగ పిండి వేసి నేతిలో రంగు మార కుండా కమ్మని వాసన వచ్చేదాకా వేయించాలి
 5. వేగాక అందులో రుబ్బి ఉంచిన పెసరపప్పు ముద్ద ని వేసుకొని కలుపుతూ సిం లో వేయించుకోవాలి
 6. ఇప్పుడు మరో పక్క స్టవ్ మీద గిన్నె పెట్టి కప్పుడు నీళ్లు పోసి అందులో కప్పున్నర పంచదార వేసి కరిగే దాకా తిప్పుతూ ఉండాలి
 7. పాకం మారుగుతుండగా అందులో యాలుకల పొడి మరియు కేసరి వేస్తే మంచి రంగు వస్తుంది. పాకం వల్ల హల్వా కూడా మంచి రంగులో ఉంటుంది.
 8. పప్పు ముద్దని బాగా కలుపుతూ బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి
 9. అవసరమయితే మరికొంచెం నెయ్య వేయవచ్చు
 10. పాకం బాగమరిగి లేత పాకం వచ్చాక పొయ్యి కట్టేయండి
 11. ముద్ద రంగు మారాక మరిగి ఉంచిన పాకాన్ని ఈ ముద్దలో మెల్లిగా పోయాలి
 12. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి
 13. ఇప్పుడు పాకాన్ని పీల్చి నెయ్య వొదిలేదాక మెల్లగా కలుపుతూ ఉండాలి
 14. ఇప్పుడు ఇందులో తయారుగా ఉంచిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి
 15. బాగా దగ్గరపడి రంగు కూడా మారి నెయ్య టెలి వరకు ఉడికించుకొని దించుకోండి .
 16. అంతే ఎంతో వేగంగా తయారయ్యే రుచికరమయిన పెసరపప్పు హల్వా రెడి.
 17. వేడి వేడి గా తింటే ఆహా ఎంతో రుచిగా ఉంటుంది

నా చిట్కా:

పంచదార నేను చాలా తక్కువ కొలత వేసాను .మీకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చును..

Reviews for Moong daal ka halwa Recipe in Telugu (0)