హోమ్ / వంటకాలు / కోవా తో పాయసం

Photo of Kova  kheer by Shobha.. Vrudhulla at BetterButter
1099
3
0.0(0)
0

కోవా తో పాయసం

Nov-20-2018
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోవా తో పాయసం రెసిపీ గురించి

ఈ ఖీర్ చాలా రుచిగా ఉంటుంది.చాలా హెవీ గా కూడా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • మహారాష్ట్ర
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 5

  1. కోవా 1పావు
  2. పాలు 2 లీటర్ల
  3. పంచదార 2 కప్పులు
  4. మైదా 50 గ్రామ్స్
  5. యాలుకల పొడి ఒక చెంచా
  6. నెయ్యి 4 చంచాలు

సూచనలు

  1. ముందుగా పాలు పొంగటానికి స్టవ్ మీద పెట్టుకోవకేను
  2. పొంగిన తరువాత 2 లీటర్ల పాలు ఒక లీటర్ అయ్యేదాకా బాగా మరిగించాలి
  3. అలా మరిగించాక అందులో పంచదార వేసి మళ్ళీ కొంతసేపు మరిగించాలి
  4. పంచదార కరిగాక పాలు పల్చగా అవుతాయి కాబట్టి మరికొంత సేపు మరగనివ్వాలి
  5. ఇలా మరగటం వల్ల పాలు రంగు మారి లేత బంగారు రంగు లోకి వస్తాయి మరియు చిక్కగా కూడా అవుతాయి
  6. ఇలా మరిగే లోపు కోవాకి మైదా కి రెండు కలపాలి
  7. అంతే కోవలో మైదా వేసి బాగా మర్దనా చేయాలి
  8. యి రెండు కలిపి బాగా మర్దన చేసాక అందులోంనుంచి ఆయిల్ ల తడిగా అయి చాలా స్మూత్గా తయారవుతుంది కోవా
  9. యిలా వేలుతో నొక్కితే మెత్తగా దూది ల తాగాలి వరకు మర్దన చేయాలి
  10. అలా చేసాక యి కోవా మైదా మిశ్రమాన్ని వేయించాలి
  11. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి మూకుడు పెట్టి అందులో కొంచెం నెయ్య వేయండి
  12. వేడి అయిన తరువాత కలిపి ఉంచిన కోవాని యి నెయ్యలో వేసి వేయించాలి బాగా
  13. స్టవ్ ని పూర్తిగా సిం లో పెట్టి వేయించాలి
  14. కంటిన్యూ గా కలుపుతూ ఉండాలి
  15. కోవా బాగా రంగు మారి విడి విడిగా అయ్యేంత వరకు వేయించాలి
  16. అంత యిలా పిక్ లో చూపించి నట్టు విడి విడిగా అయ్యాక మంచి వాసన కూడా వస్తుంది పచ్చి వాసన పోయి
  17. అలా అయ్యాక అప్పుడు అందులో వేసిన నెయ్య వదలడం మొదలవుతుంది ..
  18. యిలా పూర్తిగా రంగు మారిపోయి నెయ్య వదిలే టైం కి స్టవ్ బంద్ చేసేయాలి
  19. స్టవ్ ఆపేక కోవా ని మారుగుతున్న పాలల్లో వేసుకోవాలి
  20. వేసిన వెంటనే 2 నిమిషాలు వరకు కలుపుతూ ఉండాలి కోవా అడుగు అంటకుండా
  21. ఒకసారి మరుగు పట్టేక మరి కలపక్కర్లేదు
  22. యిలా ఒక 5 నిమిషాలు వరకు మరగనివ్వాలి
  23. అప్పుడు అది బాగా దగ్గర పడుతుంది
  24. దగ్గర పడక స్టవ్ ఆర్పీ కిందకు దించి కాస్త మాములు పాలు ఒక అర గ్లాసుడు పోయాలి
  25. యిలా పోయటం వల్ల ఖీర్ ముద్ద పడకుండా ఉంటుంది చక్కగా
  26. అన్తే ఎంతో రుచికరమయిన కోవా ఖీర్ రెడి
  27. దీన్ని కొంత మంది వేడి వేడిగా తింటారు.
  28. కొంత మంది చాలకరక ఫ్రిడ్జె లో పెట్టి తీసి తింటారూ.
  29. ఒక సూచన...... నేను ఇక్కడ రాసిన కొలతలు వాడలేదు మా ఇంట్లో ఎవరూ తినరని.. నేను తీసుకున్న కొలతలు ఇవి... పాలు 1 లీటరు .. కోవా125 గ్రామ్స్... మైదా 25 గ్రామ్స్... పంచదరచిన్న కప్పుతో 2 కప్పులు.. యి కొలతలతో చేసి పోస్ట్ చెస్త్తున్నాను.. మిరుమికు నచ్చినట్టు యి ప్రకారం హెచ్చు తగ్గువలు చేసుకోవచ్చును..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర