హోమ్ / వంటకాలు / బందరు హల్వా

Photo of wheat  halwa by Kavitha Perumareddy at BetterButter
453
3
0.0(0)
0

బందరు హల్వా

Nov-23-2018
Kavitha Perumareddy
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బందరు హల్వా రెసిపీ గురించి

ఈ హల్వా లో గోధుమపిండి, బెల్లము,నెయ్యి, జీడిపప్పు వాడి చేస్తాము .కాబట్టి చాలా బలవర్ధకమైనది.మైదా పిండి,కార్న్ ప్లోర్ కంటే ఇలా గోధుమపిండి వాడడం మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమపిండి 250 గ్రామ్స్
  2. బెల్లము 350 గ్రామ్స్
  3. నెయ్యి 150 గ్రామ్స్
  4. జీడిపప్పు 50 గ్రామ్స్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి వేసి నీళ్లుపోసి చాలా లూజుగా పిండి కలుపుకోవాలి.ఉండలు లేకుండా చూడాలి.
  2. తరువాత ఒక గిన్నె తీసుకొని దానిపైన జ్యూస్ వడకట్టేది పెట్టి చాలా పలచాటి క్లాత్ వేసుకోవాలి.ముందుగా కలిపిన పిండిని ఈ క్లాత్ లో వడకట్టుకోవాలి ...స్పున్ తో కదుపుతూ ఉంటే పిండి కిందికి గిన్నెలోకి దిగుతుంది.
  3. అవసరమైతే ఇంకా కొద్దిగా నీళ్లుపోసుకుంటు కలుపుతూ వడకట్టాలి.సన్నటి పిండి కిందికి దిగుతోంది.పైన పొట్టు మిగిలి పోతుంది ...దానిని పడేయాలి.
  4. ఈ పిండిని అలా పెట్టుకొని పోయిమీద మందంగా వుండే బాండిపెట్టి బెల్లము తురుము తగినన్ని నీళ్లు పోసి తీగ పాకం రానివ్వాలి.ఇప్పుడు నానినపిండిని మళ్ళీ అంతా స్పున్ తో కలిపి పాకంలో కలుపుకుంటూ వేసుకోవాలి.
  5. కొద్దిగా దగ్గరపడిన తరువాత నెయ్యి కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుతూ కలుపుతూనే ఉండాలి.
  6. ఇలా నెయ్యి మొత్తం వేసుకొని కలుపుతూనే ఉండాలి.తరువాత జీడిపప్పు వేసి కలపాలి .జీడిపప్పు వేయించక పోయిన పర్లేదు .ఇలా బాగా కలుపుతూ దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  7. ఒక ప్లేట్ లో వేసుకొని చల్లారనివ్వాలి.
  8. తరువాత సర్వ్ చేయాలి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర