హోమ్ / వంటకాలు / బేబీ కార్న్ మంచూరియన్

Photo of Baby corn Manchurian by Sree Sadhu at BetterButter
738
5
0.0(0)
0

బేబీ కార్న్ మంచూరియన్

Nov-24-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బేబీ కార్న్ మంచూరియన్ రెసిపీ గురించి

ఇది చాలా మంచి స్టార్టర్ మరియు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. 200 గ్రాములు బేబీ కార్న్ ఫింగర్స్
  2. 1/4 కప్ మైదా
  3. 2 చెంచాలు కార్న్ ఫ్లోర్
  4. 1 చెంచా అల్లం వెల్లులి పేస్ట్
  5. 1/2 చెంచా సొయా సాస్
  6. 1/2 చెంచా మిరియాల పొడి
  7. 1/2 చెంచా ఉప్పు
  8. 1/2 కప్ నీళ్లు
  9. నూనె వేయించడానికి సరిపడా
  10. 1 చిన్న ఉల్లిపాయ
  11. 3 ఉల్లిపరకలు
  12. సన్నగా తరిగిన వెల్లులి 1 చెంచా
  13. సన్నగా తరిగిన అల్లం 1 చెంచా
  14. 1 చెంచా సొయా సాస్
  15. 1/2 చెంచా వెనిగర్
  16. 1 చెంచా రెడ్ చిల్లి సాస్
  17. 1 చెంచా టమాటో కెచప్
  18. 1/2 చెంచా మిరియాల పొడి
  19. 1 చెంచా ఉప్పు
  20. 1 చెంచా నూనె

సూచనలు

  1. ముందుగా బేబీ కార్న్ ని బాగా కడిగి ఫింగర్ ల కట్ చేసి పెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో మైదా, కార్న్ ఫ్లోర్ ,ఉప్పు, మిరియాల పొడి ,సొయా సాస్, నీళ్లు వేసి బటర్ తయారు చేసుకోవాలి
  3. అందులో అల్లం వెల్లులి పేస్ట్ కూడా వేసుకోవాలి
  4. అందులో బేబీ కార్న్ ముక్కలు వేసి బాగా కోట్ అవ్వనివ్వాలి
  5. ఇప్పుడు వాటిని ఒక దాని తరువాత ఒకటి వేడి నూనె లో వేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి
  6. ఇప్పుడు సాస్ తయారీ కోసం ఒక పాన్ లో నూనె వేసి బాగా హీట్ చేయాలి
  7. అది బాగా వేడి అయ్యాక అందులో ఉల్లిపాయ, అల్లం, వెల్లులి ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి
  8. అవి వేగిన తరువాత అందులో సొయా సాస్ ,రెడ్ చిల్లి సాస్ ,ఉప్పు, పెప్పర్ ,టమాటో సాస్ వేసి వేయించాలి
  9. ఇప్పుడు అందులో వేయించిన బేబీ కార్న్ వేసి బాగా కోట్ అవ్వనివ్వాలి
  10. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి స్ప్రిన్ ఆనియన్ వేసి సర్వ్ చేయడమే
  11. దీనిని సన్నగా తరిగిన క్యాబేజీ ,క్యారెట్ తో సర్వ్ చేస్తే అద్భుతం గ ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర