హోమ్ / వంటకాలు / మసాలా పెసర పుణుకులు.

Photo of Masala moong vada by Swapna Tirumamidi at BetterButter
566
9
0.0(0)
0

మసాలా పెసర పుణుకులు.

Nov-24-2018
Swapna Tirumamidi
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా పెసర పుణుకులు. రెసిపీ గురించి

చల్లని సాయంకాలం వేడి వేడి గా తినడానికి ఎంతో చక్కని ఐటమ్ ఇది.కడుపు బరువు చెయ్యదు.పిల్లలు మెచ్చే పదార్ధం.ఉదయం టిఫిన్ లా లేదా రాత్రి టిఫిన్ లా పిల్లకు స్కూల్ కి పెట్టడానికి చాలా బావుంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. పెసర పప్పు 250 గ్రాములు
  2. అల్లంముక్కలు 4 చెంచాలు
  3. కరివేపాకు 5 రెబ్బలు
  4. జీలకర్ర ఒకటిన్నర చెంచాడు
  5. పచ్చి మిర్చి ముక్కలు 6కాయలవి
  6. ఉప్పు తగినంత.
  7. జాజికాయ పొడి చిటికెడు
  8. నూని వేయించడానికి చాలినంత.

సూచనలు

  1. పొట్టు లేని పెసరపప్పు ని 2 సార్లు శుభ్రంగా కడిగి 30 నాన పెట్టాలి.
  2. ఈ లోగా అల్లం,పచ్చిమిర్చి,కరివేపాకు అన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  3. జీలకర్రకూడా కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి...ఇలా దంచి వేయడం వల్ల సువాసన పిండికి బాగా పడుతుంది...
  4. పెసరపప్పు బాగా నానాక నీరు బాగా తీసేసి సగం పప్పుని బాగా మెత్తగా రుబ్బాలి
  5. మిగిలిన సగం పప్పుని కాస్త బరక గా రుబ్బుకోవాలి...నీరు వేయకూడదు..
  6. ఇప్పుడు వేయించడానికి లోతైన మూకుడు పెట్టి సరిపడా నూనిపోసి మీడియం మంట మీద కాగనివ్వాలి.
  7. నూనె కాగేలోపు... మెత్తగా రుబ్బినపిండి ని బరకగా రుబ్బినదాన్ని ఒక గిన్నీలోకి తీసుకుని బాగా కలిపి ఉప్పు,దంచిన జీలకర్ర ...జాజికాయ పొడి,అల్లంముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు,కరివేపాకు తరుగు పైన చెప్పినవన్నీ ఆ పిండిలో కలిపిపెట్టుకోవాలి.ఈ మిశ్రమం మరీ గట్టిగా ఉండకూడదు...అలా అని నీరూవెయ్యకూడదు.సుమారుగా జంతికల మిశ్రమము ఉన్నట్టు కలపాలి.
  8. నూనె కాగగానే ఆలస్యం చేయకుండా నచ్చిన పరిమాణంలో ముద్దలుగా చేస్తూ నూనెలో జాగర్తగా వేసుకోవాలి...వెయ్యగానే పిండి ముద్దలు పైకి తెలిపోవాలి....ఇలా అన్నీ వేసి మంచి బంగారు రంగు వచ్చేదాకా వేయించి దేవుకోవాలి....
  9. అంతే కమ్మని,చక్కని వేడివేడి మసాలా పెసర పుణుకులు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర