బాదాం పూరీ | BADAM PURI Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  25th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of BADAM PURI by Harini Balakishan at BetterButter
బాదాం పూరీby Harini Balakishan
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

3

0

బాదాం పూరీ వంటకం

బాదాం పూరీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BADAM PURI Recipe in Telugu )

 • వేయించడానికి నూనె
 • గార్నిష్ కొరకు చెర్రీస్
 • ఒక చంచా నిమ్మరసం
 • అర చంచా జాజికాయ పొడి
 • కేసరీ రంగు
 • ఒక కప్పు చక్కర
 • చిటికెడు ఉప్పు
 • అరకప్పు నెయ్యి
 • ఒక కప్పు మైదా

బాదాం పూరీ | How to make BADAM PURI Recipe in Telugu

 1. ముందు నెయ్యి ఉప్పు బాగా రుద్దుకుని, మాదా కలిపి , అవసరమైనంత చల్ల నీరు వేసి గట్టి పిండి తడపాలి
 2. చిన్న చిన్న ఉండలు చేయ్యాలి
 3. సన్నగా బేలించి నెయ్యి గాని నూనె గాని పూసి పొడిపిండి జల్లాలి
 4. సగానికి మడచి మళ్ళీ నెయ్యి రాసి పొడి పిండి జల్లాలి
 5. మళ్ళీ సగానికి మడచి, ఫోర్క్ తో పొడవాలి. వేయించి నప్పుడు పూరీలు ఉబ్బకుండా
 6. అన్నీ పూరీలు రెడీ చేసుకోవాలి
 7. ఒక కప్పు చక్కర, అరకప్పు నీరు వేసి పాకంచేసుకుని, కేసరీ రంగు, జాజి కాయపొడి నిమ్మరసం కలపాలి
 8. వేడి నూనెలో సన్నమంటపై పూరీలను దోరగా వేయించాలి
 9. పాకంలో రెండు నిమిషాలు ఉంచి సర్వింగ్ ప్లేట్లోకి తీయాలి
 10. చెర్రీస్తో గార్నిష్చేసి, మరుసటిరోజు తింటే భలేబాగా ఉంటుంది

నా చిట్కా:

యాలకులు లేక కేసర్ కూడా వాడొచ్చు

Reviews for BADAM PURI Recipe in Telugu (0)