హోమ్ / వంటకాలు / బననా పూరి

Photo of Banana poori by Swetha Vijayagiri at BetterButter
578
2
0.0(0)
0

బననా పూరి

Nov-30-2018
Swetha Vijayagiri
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బననా పూరి రెసిపీ గురించి

అరటి పండ్లు అంటే అందరికి ఇష్టం ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది.పిల్లలు ఇష్టం గా తింటారు రొటీన్ గా కాకుండా పూరి చేసాను

రెసిపీ ట్యాగ్

  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. గోధుమ పిండి: 1 కప్
  2. అరటిపండు: 2
  3. ఇలాచి పొడి: 1/2 స్పూన్
  4. కొబ్బరిపొడి: 2 స్పూన్స్
  5. బెల్లం: 1/2 కప్
  6. బియ్యం పిండి: 1/4 కప్
  7. ఆయిల్: డీప్ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా అరటిపండ్ల ని మెత్తగా మెదుపుకొని పెట్టుకోవాలి
  2. ఒక బౌల్ లో బియ్యం పిండి,గోధుమ పిండి,ఇలాచి పొడి,కొబ్బరిపొడి వేసి కలుపుకోవాలి
  3. స్టవ్ మీద గిన్నె పెట్టి బెల్లం వేసి 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకొని వేడి చెయ్యాలి.నీళ్ళు వేడి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కలుపుకున్న పిండి అరటి పండు గుజ్జు 3 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు పిండి చల్లారాక బాగా మర్దనా చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  5. ఇప్పుడు పిండి ని తీసుకొని చిన్న ఉండలు చేసుకుని చేతి తో ఒత్తుకొని డీప్ఫ్రై చేసుకోవాలి
  6. బననా పూరి వేడి వేడిగా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర