హోమ్ / వంటకాలు / మలై కోఫ్తా

Photo of Malai Kofta by Tejaswi Yalamanchi at BetterButter
630
3
0.0(0)
0

మలై కోఫ్తా

Dec-02-2018
Tejaswi Yalamanchi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మలై కోఫ్తా రెసిపీ గురించి

మలైకోఫ్తా ఒక అద్భుతమైన రుచి కలిగినటువంటి వెజిటేరియన్ రిసిపి. ఈ వంటను ఎక్కువగా నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్ లో సర్వ్ చేస్తుంటారు . అంతే కాదు, నార్త్ ఇండియన్స్ ఏ పార్టీయైనా, మరియు ఫామిలీ ఫంక్షన్స్ అయినా, ఈ వంటను ఒక సిగ్నేచర్ డిష్ గా వండుతుంటారు. ఇంకా ఇది వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ వారికి ఇష్టమైనటువంటి మంచి ఫ్లేవర్ మరియు టేస్ట్ కలిగి ఉంటుంది.మలైకోఫ్తా గురించి మీరు వినేటప్పుడు, ఇది తయారుచేయడానికి చాలా ఎక్కువ టైమ్ పడుతుందనుకుంటారు. మరియు తయారుచేసే పద్దతి కూడా డిఫరెంట్ అనుకుంటారు. కానీ, ఈ శ్రమ, టైమ్ ను సేవ్ చేయడం కోసమనీ, చాలా వరకూ ఈ వంటను రెస్టారెంట్స్ లో ఆడర్ ఇచ్చి చేయించుకుంటుంటారు. అయితే ఈ క్రీమి వెజిటేరియన్ రిసిపిని 30-40నిముషాలు ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. మరి ఎలా తయారుచేయాలి? అందుకు కావల్సిన పదార్థాలేంటో తెలుసుకుందాం...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఉత్తర భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. గ్రేవీ పేస్ట్ కోసం కవల్సినపదర్దలు:
  2. టొమాటో ముక్కలు : 1 1/2 కప్
  3. ఉల్లిపాయ ముక్కలు : 1 కప్
  4. లవంగం : 3
  5. యాలకలు : 3
  6. దాల్చినచెక్క : 2 చిన్న ముక్కలు
  7. జీడిపప్పు : 15
  8. నూనె : 4 టేబుల్ స్పూన్లు
  9. నీరు తగినన్ని
  10. గ్రేవీ కోసం ముందుగా కావాల్సినవి:
  11. నూనె : 2 చెంచాలు
  12. యాలకలు : 3
  13. దాల్చినచెక్క : 1 చిన్న ముక్కలు
  14. బిర్యాని ఆకు : 1
  15. అల్లం-వెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
  16. ఉప్పు : 3/4 టీస్పూన్
  17. కారం : 3/4 టీస్పూన్
  18. గరంమసాలా : 1/2 టీస్పూన్
  19. ధనియాలపొడి : 1/2 టీస్పూన్
  20. ఫ్రెష్ క్రీమ్ : 2 టేబుల్ స్పూన్లు
  21. కోఫ్తా కోసం కావల్సిన పదార్థాలు:
  22. పనీర్ : 1/2 కప్ (తురుముకోవాలి)
  23. బంగాళదుంప : 1/2 కప్ (ఉడికించి మెత్తగా చేయాలి)
  24. ఉప్పు : 3/4 టీస్పూన్
  25. గరమసాలా : 1 టేబుల్ స్పూన్
  26. కొత్తిమీర తరుగు : 2 టేబుల్ స్పూన్లు(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
  27. పచ్చిమిర్చి : 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
  28. అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
  29. మొక్కజొన్న పిండి : 2 టేబుల్ స్పూన్లు
  30. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  31. ఫ్రెష్ క్రీమ్ : 2 టేబుల్ స్పూన్లు (గార్నిషింగ్ కోసం)
  32. కొత్తిమీర తరుగు : 1 టీస్పూన్ (గార్నిషింగ్ కోసం)

సూచనలు

  1. ముందుగా ఒక బాండి పెట్టీ నునే వేసి అది కాగాక టొమాటో ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పులు,లవంగాలు,దాల్చిన చెక్క,యాలకలు వేసి టొమాటో మెత్తగా అయే దాకా వేయించండి.
  2. తర్వాత మరో పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగాక ,అందులో దాల్చిన చెక్క, యాలకులు, అల్లంవెల్లుల్లి పేస్ట్ మరియు బిర్యని ఆకు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
  3. ఇప్పుడు ఉల్లిపాయ టొమాటో పేస్ట్ కూడా వేసి మరో మూడు-నాలుగు నిముషాలు వేగించుకోవాలి.
  4. దానిలో ఉప్పు,కారం,గరంమసాలా, ధనియాలపొడి వేసి కొద్దిగా నీరు పోసుకొని బాగా కలిపి గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి.
  5. ఉడికాక ఫ్రెష్ క్రీమ్ వేసి కలిపి ఒక నిమిషం తరువాత పోయి అపి గ్రేవీ ని పక్కన పెట్టుకోండి.
  6. తర్వాత కోఫ్తాకు సిధ్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. 
  7. తరువాత బాల్స్ గా చేసుకోవాలి.(మీకు ఎంత ఆకారం కావాలనుకుంటే అలా పెద్దగా లేదా చిన్నగా )
  8. డీప్ ప్రైయింగ్ పాన్ పెట్టీ నూనె వేసి వేడిచేయాలి.ఇప్పుడు కాగే నూనెలో ఈ కోఫ్తాబాల్ వేసి డీప్ ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగించుకొన్న కోఫ్తాలను తీసి పక్కన పెట్టుకోవాలి.
  9. కోఫ్తాలు తయారు.
  10. తర్వాత కోఫ్తాలను సర్వింగ్ ప్లేట్ లో కోఫ్తాలను సర్ధాలి, తర్వాత వాటిమీద ఉడికించుకొన్న గ్రేవీని పోయాలి.
  11. చివరగా ఫ్రెష్ క్రీమ్ మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే మలైకోఫ్తా కర్రీ రెడీ . ఈ క్రీమీ వెజిటేరియన్ రిసిపి పరోటా లేదా రోటీలకు మంచి కాంబినేషన్.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర