హోమ్ / వంటకాలు / సౌత్ ఇండియన్ మిక్చర్

Photo of South Indian Mixture by Abhinetri V at BetterButter
577
3
0.0(0)
0

సౌత్ ఇండియన్ మిక్చర్

Dec-02-2018
Abhinetri V
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సౌత్ ఇండియన్ మిక్చర్ రెసిపీ గురించి

సాయంకాలము వేడి చాయ్ తో లేదా ఫిల్టర్ కాఫీ తో ఈ సౌత్ ఇండియన్ మిక్చర్ భలే రుచిగా ఉంటుంది. కరకరలాడే ఈ మిక్చర్ సులువుగా ఎలా తయ్యార్ చెయ్యాలో ఇప్పుడు చూదాం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. అటుకులు ( మెషీన్ ) - 3 కప్పులు
  2. పల్లీలు - 1 కప్పు
  3. కరివేపాకు- 4 లేదా 5 రెమ్మలు
  4. కారం - 2 టీస్పూన్స్
  5. ఉప్పు- రుచికి సరిపడ
  6. పసుపు - చిటికెడు
  7. నూనె- వేయించడానికి సరిపడ
  8. బూందీ కి కావాల్సిన పదార్ధాలు - సేనగపింది - 1కప్పు
  9. మంచి నీరు - 3 నుండి 4 టేబుల్ స్పూన్స్
  10. ఉప్పు-తగినంత
  11. కారం పొడి - 1/4 టీస్పూన్
  12. నూనె - వేయించడానికి సరిపడ
  13. జొన్న నిమికి కి కావాల్సిన పదార్థాలు - జొన్న పిండి - 1 కప్పు
  14. ఉప్పు- తగినంత
  15. వేడి నూనె - 2 టేబుల్ స్పూన్స్
  16. నీరు - 1/4 కప్పు

సూచనలు

  1. ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకోవాలి. నూనె మరిగిన తరువాత అటుకులని డీప్ ఫ్రై చేసుకోవాలి.
  2. డీప్ ఫ్రై చేసిన అటుకులని ఒక పెద్ద సైజ్ గిన్నెలో వేసుకోవాలి.
  3. అదే మాదిరిగా పల్లిలని, మరియు కరివేపాకు ని విడి విడి గా శుభ్రంగా నూనె లో డీప్ ఫ్రై చేసుకోవాలి.
  4. వీటిని కూడా అటుకుల మిశ్రమంలో వేసుకోవాలి.
  5. బూందీ తయారీ : ఇప్పుడు ఒక గిన్నెలో సేనగపింది, ఉప్పు, కారం మరియు కాస్త నీరు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొంచం జారు గా ఉండాలి.
  6. బూందీ చట్రం తీసుకొని , పై తయారు చేసుకున్న మిశ్రమాన్ని నెమ్మదిగా ఒక గరిటతో వేస్తూ చిన్న ఆకారం లో ఉండే బూందీ గా వేసుకోవాలి. ఈ బూందీ ని జాగ్రత్తగా రెండు వైపులా వేగనివ్వాలి. వేగిన బూందీ ని ఒక పళ్ళెంలో తీసుకొని కసేపు చల్లారనివ్వాలి.
  7. జొన్న నిమికి తయారీ: ఒక గిన్నె లో జొన్న పిండి, ఉప్పు, వేడి నూని, కాస్త మంచినీరు వేసి ఒక ముద్దగా తయ్యార్ చేసుకోవాలి. ఈ ముద్ద /డో చపాతీ ముద్ద మాదిరిగా ఉండాలి.
  8. పై ముద్ద ని క్రమంగా వత్తి, 1 ఇంచ్ మందం గా ఉండే చపాతీ మాదిరిగా చేసుకోవాలి.ఇప్పుడు ఒక కత్తి సహయం తో చిన్న సైజ్ డైమండ్ ఆకారం లో కట్ చేసుకోవాలి.
  9. డైమండ్ ఆకారంలో కోసిన వాటిని నూనె లో రెండు వైపులా వేగనివ్వాలి. బంగారు వర్ణం లో మారిన తరువాత వీటిని మరియు బూందీ లని కూడా అటుకుల మిశ్రమంలో వేసుకోవాలి.
  10. ఇప్పుడు ఒక కడాయ్ లో 2 టేబుల్ స్పూన్స్ నూనె రుచికి సరిపడినంత ఉప్పు, తగినంత కారం , పసుపు వేసుకొని సన్నని సెగ పైన 2 సెకన్లు వేగనివ్వాలి.
  11. పై మిశ్రమాన్ని ముందుగా తయ్యార్ చేసుకొని పెట్టుకున్న అటుకులు,బూందీ, మరియు జొన్న నిమికి మిశ్రంలో వేసుకోని శుభ్రంగా అన్ని వైపుల నుండి కలుపుకోవాలి.
  12. అంతే .. ఎంతో రుచికరంగా ఉండే సౌత్ ఇండియన్ మిక్చర్ రెడి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర