మసాలా వడ | Masala vada Recipe in Telugu

ద్వారా swetha vijayagiri  |  5th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Masala vada by swetha vijayagiri at BetterButter
మసాలా వడby swetha vijayagiri
  • తయారీకి సమయం

    3

    గంటలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

మసాలా వడ వంటకం

మసాలా వడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Masala vada Recipe in Telugu )

  • శనగపప్పు: 1 కప్
  • అలసందలు: 1/2 కప్
  • మిర్చి: 6
  • ఉల్లిపాయలు: 2
  • లవంగాలు: 5
  • ఇలాచి: 2
  • దాల్చినచెక్క: 1/2 అంగుళం
  • ఉప్పు: సరిపడా
  • కొత్తిమీర: 1/4 కప్
  • పుదీనా: గుప్పెడు
  • కరివేపాకు: 2 రెమ్మలు
  • వెల్లుల్లి: 1
  • జీలకర్ర: 1 స్పూన్
  • ఆయిల్: డీప్ఫ్రై కి సరిపడా

మసాలా వడ | How to make Masala vada Recipe in Telugu

  1. ముందుగా అలసందలు,శనగపప్పు ని కడిగి 3 గంటలు నానబెట్టుకోవాలి
  2. ఇప్పుడు పప్పుని నీళ్లలో నుండి తీసి మిక్సీ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి
  3. అది పక్కన పెట్టి జార్ లో మిర్చి,ఒక ఉల్లిపాయ, లవంగాలు, ఇలాచి, దాల్చినచెక్క, వెల్లుల్లి,జీలకర్ర,సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని పప్పు మిశ్రమం లో కలుపుకోవాలి
  4. ఇప్పుడు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి,కొత్తిమీర, పుదీనా,కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి అయ్యాక వడలు వేసుకోవాలి
  6. ఎర్రగా కాల్చుకుని సర్వ్ చేసుకోవాలి వేడిగా తింటే చాలా బాగుంటాయి

నా చిట్కా:

వడలు వేసుకునేటప్పుడు కొద్దిగా నానబెట్టిన శనగపప్పు వేస్తే బాగుంటాయి

Reviews for Masala vada Recipe in Telugu (0)