మిర్చి బజ్జి | Mirchi bajji Recipe in Telugu

ద్వారా swetha vijayagiri  |  11th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Mirchi bajji by swetha vijayagiri at BetterButter
మిర్చి బజ్జిby swetha vijayagiri
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

మిర్చి బజ్జి వంటకం

మిర్చి బజ్జి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mirchi bajji Recipe in Telugu )

  • బజ్జి మిర్చి: 1/4 కిలో
  • శనగపిండి: 1 కప్
  • కార్న్ ఫ్లోర్: 2 స్పూన్స్
  • బియ్యం పిండి: 2 స్పూన్స్
  • జీలకర్ర: 1/2 స్పూన్
  • ఉప్పు: తగినంత
  • చింతపండు గుజ్జు: 3 స్పూన్స్
  • నువ్వుల పొడి: 2 స్పూన్స్
  • ఆయిల్: డీప్ఫ్రై కి సరిపడా
  • చాట్ మసాల: 1 స్పూన్
  • దనియపొడి: 1/2 స్పూన్

మిర్చి బజ్జి | How to make Mirchi bajji Recipe in Telugu

  1. మిర్చి లు మధ్యలో కట్ చేసి గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక చిన్నా బౌల్ లో చింతపండు గుజ్జు, నువ్వులపొడి,కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేసి మిర్చి మధ్య లో స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి
  3. ఇంకో బౌల్ తీసుకొని శనగపిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్,జీలకర్ర కొద్దిగా ఉప్ఫ వేసి నీళ్లు వేస్తూ జారుడు గా కలుపుకోవాలి
  4. కడయి లో ఆయిల్ హీట్ చేసి స్టఫ్ చేసుకున్న మిర్చిలని శనగపిండి లో డిప్ చేసి ఆయిల్ లో డీప్ఫ్రై చెయ్యాలి
  5. పైన చాట్ మసాలా,దనియపొడి వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి

Reviews for Mirchi bajji Recipe in Telugu (0)