హోమ్ / వంటకాలు / ఆలూపనీర్ కోఫ్తా కర్రీ

Photo of Potato Paneer kofta  curry by Chandrika Marripudi at BetterButter
438
3
0.0(0)
0

ఆలూపనీర్ కోఫ్తా కర్రీ

Dec-13-2018
Chandrika Marripudi
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూపనీర్ కోఫ్తా కర్రీ రెసిపీ గురించి

ఆలూ పనీర్ మిశ్రమం లో మైదా కలిపి బాల్స్ చేసి నూనెలో వేయించి టమోటా గ్రేవీలో వేసి చేసుకునే కూర.అన్నం,రోటీ లోకి చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • ఉడికించాలి
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కోఫ్తాల కోసం
  2. ఆలూ : 4
  3. క్యారెట్ : 2
  4. పనీర్: 200గ్రా
  5. మైదా : 4 స్పూన్లు
  6. కార్న్ ఫ్లోర్ : 4 స్పూన్లు
  7. ఉప్పు : తగినంత
  8. కారం : 1 స్పూన్
  9. ధనియాలపొడి : 1 స్పూన్
  10. నూనె : డీప్ ఫ్రైకి సరిపడ
  11. గ్రేవీ కోసం
  12. టొమాటోలు : 8
  13. ఉల్లిపాయలు : 2
  14. ఉప్పు : తగినంత
  15. కారం : 1స్పూన్
  16. అల్లంవెల్లుల్లి పేస్ట్ : 2 స్పూన్లు
  17. గరం మసాలాపొడి : 1స్పూన్
  18. ఆవాలు : 1 స్పూన్
  19. జీలకర్ర : 1 స్పూన్
  20. నూనె : 4 స్పూన్లు
  21. కొత్తిమీర : కొద్దిగా
  22. ఫ్రెష్ క్రీం : 2 స్పూన్లు

సూచనలు

  1. ఆలూ,క్యారెట్ ను ఉడికించి పొట్టు తీసి తురిమి పెట్టుకోవాలి
  2. పనీర్ ని కూడా తురిమి అన్నింటినీ ఒకగిన్నెలోకి తీసుకోవాలి.
  3. దాన్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం,ధనియాలపొడి వేసి ముద్దలాగా కలుపుకోవాలి
  4. ఈముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పెట్టుకుని నూనెలో డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి.
  5. తరువాత స్టవ్ పైన పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి
  6. కొద్దిగా వేగాక ఉప్పు, కారం,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గాక గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ వేసి కలిపి ఉడికించాలి
  7. కొద్దిగా ఉడికాక గరంమసాలాపొడి వేసి కొద్దిగా నీళ్ళు వేసి కలిపి ఉడికించుకోవాలి.
  8. గ్రేవీ ఉడికి దగ్గర పడ్డాక గిన్నెలోకి తీసుకుని వేయించుకున్న కోఫ్తాలను గ్రేవీలో వేసి ఫ్రెష్ క్రీం,కొత్తిమీర తో అలంకరించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర