హోమ్ / వంటకాలు / Fried Icecream

Photo of Fried Icecream by Pravallika Srinivas at BetterButter
2
5
4.3(3)
0

Fried Icecream

Dec-15-2018
Pravallika Srinivas
720 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • చిలకడం
  • మిళితం
  • ఉడికించాలి
  • గడ్డకట్టేంత చల్లగా
  • చల్లగా చేసుకోవటం
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. ఐస్ క్రీమ్ చేయు విధానం కి కావాల్సిన పదార్థాలు
  2. వనిల్లా ఫ్లయివర్ ఐస్క్రీమ్ పౌడర్ - 100 గ్రాములు
  3. పాలు - 1/4 లీటర్
  4. పంచదార - 50 గ్రాములు
  5. మిల్క్ క్రీమ్ - 50 గ్రాములు
  6. వనిల్లా ఎసెన్స్ - 1/4 స్పూను
  7. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు:
  8. తాయారు చేసిన ఐస్ క్రీమ్ తగినంత
  9. బ్రెడ్ ముక్కలు : 4
  10. కన్ఫలౌర్ - 2 స్పూన్లు
  11. బ్రెడ్ క్రంబ్స్ - 1 కప్పు

సూచనలు

  1. ముందుగా ఐస్ క్రీమ్ చేయడానికి పాలు పంచదార ఒక మండపు గిన్నెలో వేసి బాగా మరిగించుకోవాలి.
  2. ఒక బౌల్ లో కొన్ని పాలు వేసి ఐస్క్రీమ్ పొడి వేసి జారుగా కలిపి మరుగుతున్న పాలల్లో వేసి దగ్గరపడేవరకు ఉడికించుకోవాలి.
  3. వనిల్లా ఎసెన్స్ వేసి బాగా బాగా కలుపుకోని చల్లారనివ్వాలి..
  4. ఒక బ్లెండర్ జార్లో తయారు చేసిన పాల మిశ్రమాన్ని మరియు ఫ్రెష్ మిల్క్ క్రీమ్ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి.
  5. ఒక గాలి చొరబడిని బాక్స్ లో వేసి మూత పెట్టి 12 గంటలు డీప్ ఫ్రిడ్జిలో సెట్ చేసుకోవాలి.
  6. ఇప్పుడు ఒక గుంత గారిట తో ఐస్ క్రీమ్ తీసుకుని ఒక బౌల్ లో పెట్టుకోవాలి.సమయాభావం వలన బయటది ఉపయోగించాను.
  7. దీన్ని ఒక 2 నుండి 3 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
  8. బ్రెడ్ తీసుకుని కోణాలు కట్ చేసుకోవాలి.
  9. ఇప్పుడు మిగిలిన బ్రెడ్ ని రోలింగ్ పిన్ తో పల్చాగా చేసుకోవాలి.
  10. బ్రెడ్ పైన ఫ్రీజర్ నుండి అప్పుడే తీసిన ఐస్ క్రీమ్ పెట్టుకోవాలి. చివర నీరు రాసి పైన మరొక బ్రెడ్ ముక్క పెట్టుకోవాలి.
  11. ఈ విధంగా అంటించి బాల్ లాగా చేసుకోవాలి.
  12. కొంచం తడి చేసుకుని ఐస్ క్రీమ్ బయటకు కనిపించకుండా కవర్ చేసుకోవాలి.దానిని ఒక సిల్వెరఫాయిల్ లో పెట్టుకుని ఈ విధం గా పాక్ చేసుకోవాలి.
  13. అన్ని వైపులా గాలి పోకుండా పాక్ చేసి 3 గంటలు డీప్ ఫ్రీజర్ లో పెట్టుకోవాలి.ఆ తర్వాత ఈ విధంగా ఉంటుంది.
  14. కార్న్ ఫ్లోర్ లో నీరు వేసి కలుపుకోవాలి.
  15. డీప్ ఫ్రై కోసం నూనె బాగా కాగనివ్వాలి.అప్పుడే తీసిన బ్రెడ్ ఐస్క్రీమ్ తీసి కన్ఫలౌర్ లో ముంచి బ్రెడ్ క్రమ్బ్స్ లో వేసి బాగా దొర్లించుకోవాలి.
  16. ఇలా బాగా అద్దుకోవాలి.
  17. ఇప్పుడు కాగిన నూనె లో వేసి వేయించుకోవాలి.
  18. బాగా గోల్డ్ కలర్ రాగానే ప్లేట్ లోకి తీసుకోవాలి.
  19. మనకు నచ్చిన విధంగా ప్లేటింగ్ చేసుకోవాలి.
  20. కట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది అలా వేడిగా తినేయాలి.చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (3)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Gadige Maheswari
Mar-18-2019
Gadige Maheswari   Mar-18-2019

Yummy :yum:

Anitha Rani
Dec-16-2018
Anitha Rani   Dec-16-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర