హోమ్ / వంటకాలు / పల్లీ కజ్జికాయలు

Photo of Groundnut kajjikayalu by Rani Gayatri at BetterButter
1003
3
0.0(0)
0

పల్లీ కజ్జికాయలు

Dec-15-2018
Rani Gayatri
0 నిమిషాలు
వండినది?
46 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లీ కజ్జికాయలు రెసిపీ గురించి

గోధుమపిండితో పూరీ చేసి అందులో వేయించిన పల్లీలు బెల్లం కలిపి, కారెట్ తురుము కూడా కలపాలి. పూరీలో పూర్ణం పెట్టాలి. కజ్జికాయలా మడిచి బాగా కాగిన నూనెలో వేయించాలి. అంతే కజ్జికాయలు రెడీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. గోధుమపిండి 1/4 కేజి
  2. బెల్లం 1 కప్పు
  3. పల్లీలు 1/4 కేజీ
  4. నూనె 1/2 లీటరు
  5. కారెట్ తురుము ఒక కప్పు

సూచనలు

  1. గోధుమపిండిని పూరీ పిండిలా కలిపి 10 నిమిషాలు నాననివ్వాలి
  2. కొద్దిగా నూనెలో పల్లీలు డీప్ ఫ్రై చేయాలి
  3. వేయించిన పల్లీలు చల్లార్చుకొని మిక్సీలో బరకగా పొడి చేసుకోవాలి .
  4. కారెట్ కడిగి చెక్కు తీసి తురుముకొని ఒక్క కప్పు కొలిచి పెట్టుకోండి
  5. బెల్లం మెత్తగా పొడి చేసుకోవాలి
  6. పల్లీ పొడి, కారెట్ తురుము, బెల్లం బాగా కలిపి పూర్ణం చేసుకోవాలి
  7. పూరీ వత్తుకుని అందులో పూర్ణం పెట్టి అంచులు తడి చేసుకుంటూ కజ్జికాయలు గా మడుచుకోవాలి
  8. కజ్జికాయలు రెడీ. వీటిని బాగా కాగిన నూనెలో అన్ని వైపులా బంగారు రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి.
  9. ఎంతో రుచికరమైన కజ్జికాయలు రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర