ఉల్లి చక్రాలు (గుడ్డులేకుండా) | Onion rings(egg less) Recipe in Telugu

ద్వారా Swapna Sashikanth Tirumamidi  |  15th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Onion rings(egg less) by Swapna Sashikanth Tirumamidi at BetterButter
ఉల్లి చక్రాలు (గుడ్డులేకుండా)by Swapna Sashikanth Tirumamidi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

25

0

ఉల్లి చక్రాలు (గుడ్డులేకుండా) వంటకం

ఉల్లి చక్రాలు (గుడ్డులేకుండా) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Onion rings(egg less) Recipe in Telugu )

  • గుండ్రటి పెద్ద ఉల్లిపాయలు 2
  • పెసర పిండి ఒక కప్పు(కొంచం బరక గా ఉన్నది)
  • వరిపిండి 2 చెంచాలు
  • పచ్చిమిర్చి ముద్ద అర చెంచా
  • జీలకర్ర అర చెంచా
  • బ్రెడ్ పొడి ఒక కప్పు
  • ఉప్పు సరిపడా.
  • వంటసోడా అర చెంచా
  • వేయించడానికి సరిపడా నూని.

ఉల్లి చక్రాలు (గుడ్డులేకుండా) | How to make Onion rings(egg less) Recipe in Telugu

  1. ముందుగా పెసరపిండిని రెడి చేసుకోవాలి(పొట్టులేని పెసర పప్పుని గంట ఎండలో పెట్టి...మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.)
  2. ఇలాచేసుకున్నపిండిని ఒక గిన్నీలోకి తీసుకుని...వరి పిండి ,పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర,ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి బజ్జి పిండిలా కలిపి 10 నిమిషాలు పక్కనపెట్టుకోవాలి.పెసర పిండి నానాక కాస్త గట్టి పడుతుంది...తరువాత మళ్ళీ కాస్తనీళ్లు పోసుకోవాలి.
  3. ఈ లోపు ఉల్లిపాయలు చక్రాలుగా తరిగి ఒక్కొక్కటిగా విడదీసి నీటిలో వేసి పెట్టుకోవాలి.
  4. నూని పొయ్యిమీద పెట్టుకుని వేడి చేసుకోవాలి...
  5. ఒక పళ్లెం లో బ్రెడ్ పొడి వేసి పెట్టుకోవాలి
  6. ఈ లోగా నానపెట్టిన పిండిలో వంటసోడా వేసి ...అవసరం ఐతే కాస్తనీరు పోసి బజ్జి పిండిలా చేసి ...అందులో 5 చప్పున ఉల్లి చక్రాలు వేసి పిండిని బాగా పట్టించాలి
  7. వాటిని బ్రెడ్ పొడిలో వేసి మొత్తం తడిపిండి అంతటా బ్రెడ్ పొడితో కవర్ అయ్యేలా పొడిలో అద్దాలి.
  8. ఇలా బ్రెడ్డుపొడి అద్దిన ఉల్లి రింగులను జాగర్తగా తీసి వేడినూనెలో వేసి ముదురు బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి.
  9. అంతే అండి చక్కటి కమ్మటి...కరకర లాడే ఉల్లి చక్రాలు సిద్ధం ...వీటిని టొమాటో కచప్ తో సర్వ్ చేసుకుంటే బావుంటాయి.

నా చిట్కా:

బ్రెడ్డుపొడిలో అద్దిన ఉల్లిరింగులను అలా డీపీఫ్రీజర్ లో నిల్వ చేసుకుంటే కావలసినప్పుడు వేయించుకోవచ్చు.

Reviews for Onion rings(egg less) Recipe in Telugu (0)