హోమ్ / వంటకాలు / వెజిటబుల్ బిర్యానీ

Photo of Vegetable Biriyani by Suma Latha at BetterButter
122
7
0.0(0)
0

వెజిటబుల్ బిర్యానీ

Dec-15-2018
Suma Latha
61 నిమిషాలు
వండినది?
55 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటబుల్ బిర్యానీ రెసిపీ గురించి

వెజిటబుల్ బిర్యానీ..కూర ముక్కలు ఎక్కువ వేసాను కాబట్టి చాలా రుచిగా వుటుంది

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • పిల్లలకు నచ్చే వంటలు
 • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 5

 1. వెజిటబుల్ బిర్యానీ కి కావాల్సిన పదార్ధాలు
 2. బియ్యం -5 కప్పులు (గ్లాసులు)
 3. నీళ్లు - 11 కప్పులు (గ్లాసులు)
 4. ఆలూ - 4
 5. క్యారట్ - 4
 6. క్యాప్సికమ్ - 1/2 కప్ ముక్కలు
 7. కాలీఫ్లవర్ -1/2 కప్ ముక్కలు
 8. క్యాబేజ్ - 1/2 కప్
 9. పచ్చి బఠాణీ - 1 కప్
 10. టొమాటో - 3
 11. ఫ్రెంచ్ బీన్స్ - 8
 12. పచ్చిమిర్చి - 4
 13. ఉల్లిపాయలు - 4 లేదా 5
 14. నూనె - సరిపడినంత
 15. కారం - 1 /2స్పూన్
 16. పసుపు - చిటికెడు
 17. పంచదార - 1/2స్పూన్
 18. నెయ్యి - 2 స్పూన్స్
 19. ఉప్పు - తగినంత
 20. బిర్యానీ ఆకు - 4
 21. బిర్యానీ మసాలా కావాల్సిన పదార్ధాలు
 22. గసగసాలు - 3 స్పూన్స్
 23. లవంగాలు - 1/4స్పూన్
 24. దాల్చిచెక్క - 1/4 లేదా 1/2 స్పూన్
 25. వెల్లుల్లి - ఒకటి పూర్తిగా (1)
 26. టొమాటోముక్కలు - 1/2 కప్
 27. ఉల్లిపాయ ముక్కలు - 1 కప్
 28. పుదీనా - గుప్పెడు
 29. అల్లం - 10గ్రాములు
 30. ఆలూ కురమా కూర కావాల్సిన పదార్ధాలు
 31. ఆలూ -2
 32. ఉల్లిపాయలు - 2
 33. పసుపు - చిటికెడు
 34. నూనె - 3 స్పూన్స్
 35. ఉప్పు - తగినంత
 36. పెరుగు -2స్పూన్స్
 37. పచ్చిమిర్చి - 4
 38. బిర్యానీ లో వేసే మసాలా - 1స్పూన్
 39. రైతా కావాల్సిన పదార్ధాలు
 40. పెరుగు - 1 కప్
 41. ఉల్లిపాయలు రెండు
 42. పచ్చిమిర్చి - 3
 43. కొత్తిమీర - గుప్పెడు
 44. ఉప్పు - తగినంత

సూచనలు

 1. వెజిటబుల్ బిర్యానీ తయారి విధానము
 2. ముందుగా అన్ని కూరలు శుభ్రంగా కడిగి తొక్క తీసే వాటిని తీసి తరగాలి అవసరం లేనివటిని మామూలుగా తరగండి కింద చూపిన ఫోటో లోలా గా
 3. ఈ విధముగా అన్ని కూరలు తరగాలి
 4. ఇప్పుడు మనం తీసుకున్న అన్ని మసాలా లని గ్రైండ్ చేసుకొండి ...బిర్యానీ ఆకు తప్పా ఈ కింద ఫోటో చూడండి మసలలాలకు
 5. స్టౌ వెలిగించి పాన్ పెట్టి కొంచం నూనె పోసి అన్ని ఒక్కదాన్ని తరువాత ఒకటి లైట్ గా వేయించుకోవాలి
 6. ఇలా వేయించి ముక్కలు ఒక ప్లేటులోకి తీసుకోండి
 7. బియ్యాన్ని శుభ్రంగా కడిగి...దాన్ని నీళ్లు లేకుండా తీసుకొని అదే కూరల నూనెలో లైట్ గా వేయిచుకోవాలి
 8. మళ్లీ దీన్ని కూడా ఓ ప్లేట్ కి తీసుకోండి
 9. ఆ నూనెలో కొంచం నెయ్యి వేసి....గ్రైండ్ చేసిన మసాలా ముద్ద వేయించాలి వాసన వచ్చేవరకు చివరగా పంచదార కారం పసుపు వేసి ఓ ప్లేట్ లోకి తీసుకోండి
 10. ఇప్పుడు 5 కప్పులు (గ్లాసులు) బియ్యానికి 11 కప్పుల నీళ్లు పోయండి కుక్కర్ లో ఉప్పు తగినంత వేసి మరగించుకోవలి
 11. దాంట్లో అన్ని ముక్కలు, బియ్యం , మసాలా ముద్ద బిర్యానీ ఆకు వేసి పూత పెట్టండి
 12. రెండు విజిల్స్ వచ్చేవారు వుంచి స్టాఫ్ సిమ్ చేసి 5 నిమిషాలు వుంచి ఆఫ్ చేసుకోండి స్టాఫ్ నీ
 13. అంతే వెజిటబుల్ బిర్యానీ రెడీ !!
 14. ఆలూ కుర్మా కూర తయారి విధానము
 15. ఆలూ ,ఉల్లిపాయలు ,పచ్చి మిర్చి చిన్న ముక్కలు చేసి స్టౌ వెలిగించి పాన్ పెట్టి దాంట్లో 2 లేదా 3 స్పూన్స్ నూనె పోసి వేడి అయినాక
 16. ఉల్లిపాయలు ,పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు అయినాక ఆలూ కూడా వేసి వుడికించుకొండి అలా వుడికిన కూరలో
 17. బిర్యానీ కి వేసిన వేయించిన మసాలా 1 స్పూన్ , ఉప్పు తగినంత పసుపు వేసి వుడికించుకోవాలి స్టాఫ్ ఆఫ్ చేసి 2 స్పూన్స్ పెరుగు కలపాలి !
 18. అంతే ఆలూ కుర్మా రెడీ !!
 19. రైతా తయారి విధానము
 20. ఉల్లిపాయలు ,కొత్తిమీర ,పచ్చిమిర్చి సన్నగా తరగాలి
 21. అలా తరిగిన పచ్చి ముక్కలని పెరుగులో ఉప్పు వేసి కలపాలి
 22. అంతే రైతా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర