దహీ కబాబ్. | Dahi kebab . Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  15th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Dahi kebab . by దూసి గీత at BetterButter
దహీ కబాబ్.by దూసి గీత
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

దహీ కబాబ్. వంటకం

దహీ కబాబ్. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dahi kebab . Recipe in Telugu )

 • అవసరమైన పదార్థాలు:
 • 1-నీరు తీసేసిన గట్టి పెరుగు (,hung curd): 1 కప్పు
 • 2- అటుకులు : 1/2 కప్పు.
 • 3- చిన్న గా ముక్కలు చేసిన నట్స్ : 1/4 కప్పు.
 • 4- ఉప్పు: 1/4 చెంచా
 • 5- ఖారం - 1/4 చెంచా.
 • 6- పచ్చిమిర్చి తరుగు: 1/4 చెంచా
 • 7- కొత్తిమీర తరుగు: 1/4 కప్పు.
 • 8- మైదా/ కార్న్ ఫ్లోర్ : 1/4 కప్పు.
 • 9- నూనె షాలో ఫ్రై కి అవసరమైనంత

దహీ కబాబ్. | How to make Dahi kebab . Recipe in Telugu

 1. రేపు కబాబ్ చేస్తాం అంటే మేము ముందు రోజు రాత్రి పెరుగుని మస్లిన్ బట్టలో వడకట్టి నీరంతా తీసేసి ఫ్రిజ్ లో పెట్టాలి. మర్నాడు ఈగట్టి ముద్ద లాంటి పెరుగు రెడీ గా ఉంచుకోవాలి.
 2. అటుకులు మిక్స్కీ లో వేసి పౌడర్ చేసుకోవాలి.
 3. అటుకుల పొడిని హంకర్డ్ లో వేసి,ఉప్పు,ఖారం,కొద్దిగా పంచదార, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసి కలుపుకోవాలి.
 4. ఇవన్నీ బాగా కలిసేలా కలిపి మృదువైన పిండి ముద్ద లా చెయ్యాలి.
 5. పలుకులు గా చేసిన నట్స్ వేయించి పెట్టుకోవాలి.
 6. కలిపిన ముద్ద ను చిన్న చిన్న ఉండలుగా చేసి నట్స్ అందులో స్టఫ్ చెయ్యాలి.
 7. అన్నింటిలో ఇలా స్టఫ్ చేసి పొడి మైదాలొ అద్ది ఉంచాలి
 8. పేన్ లో 2 /3 చెంచాలు నూనె వేసి వేడెక్కాక కబాబ్స్ వేసి రెండు వైపులా షాలో ఫ్రై చెయ్యాలి.నోరూరించే దహీ కబాబ్స్ సిద్ధం

నా చిట్కా:

దహీ కబాబ్స్ నేతిలో ఫ్రై చేస్తే రుచి కమ్మగా ఉంటుంది.పెరుగు కూడా తియ్యని పెరుగైతేనే బావుంటుంది.

Reviews for Dahi kebab . Recipe in Telugu (0)