Photo of Dhokla by Aparna Reddy at BetterButter
1154
2
5.0(0)
0

Dhokla

Dec-20-2018
Aparna Reddy
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • గుజరాత్
  • ఆవిరికి
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. 100గ్రాములు శనగపిండి
  2. 2 చెంచాల పంచదార
  3. 1 చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్
  4. ఉప్పు రుచికి సరిపడా
  5. 1/4 చెంచా పసుపు
  6. 1/2 చెంచా ఈనో (ఫ్రూట్ సాల్ట్)
  7. 1/2 చెంచా నూనె
  8. 2 చెంచాల బొంబాయి రవ్వ
  9. 1/2 లీటర్ నీళ్ళు
  10. పోపు కొరకు :
  11. 2 చెంచాల నూనె
  12. 1/4చెంచా ఆవాలు
  13. 1/4చెంచా జీలకర్ర
  14. కొద్దిగా ఇంగువ
  15. కరివేపాకు తగినంత
  16. కొత్తిమీర గార్నిష్ కు తగినంత

సూచనలు

  1. ఢోఖ్ల చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి.
  2. అందులో శనగపిండి,బొంబాయిరవ్వ,, పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి.కొంచెము కొంచెము గా నీళ్లు వేసుకొంటు కలుపుకోవాలి.ఇప్పుడు పైన తీసుకొన్న పదార్థాలు అన్ని కలుపుకోవాలి.చివరగా ఈనో వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని పిండిని కొంచెం పలుచగా కలిపిఉంచుకోవాలి.
  3. ఇప్పుడు పిండిపైన మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  4. ఒక మందపాటి గిన్నె తీసుకొని ఆయిల్ తో గ్రీసు చేసుకోవాలి.పైన పక్కన పెట్టి ఉంచుకున్న పిండిని ఇందులో వేసుకోవాలి
  5. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 1/2లీటర్ నీళ్లు పోసుకొని పైన పిండిఉన్న మందపాటి గిన్నె పెట్టి కుక్కర్ మూత పెట్టి 15 నిమిషాలు చిన్న మంటమీద పెట్టవలెను.విస్సల్ పెట్టకూడదు.
  6. ఢోఖ్ల తయారు అయ్యింది.
  7. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి.
  8. పోపుకోసం స్టవ్ మీద చిన్న గరిట పెట్టుకొని అందులో2 చెంచాల నూనె తీసుకొని ఆవాలు,కరివేపాకు,కొంచెం జీలకర్ర. ఇంగువ వేసుకొని మంచి వాసన రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  9. ఢోఖ్ల పైన పోపు వేసుకొని కొంచెం కొత్తిమీర తో గార్నిష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అంతే ఎంతో రుచికరమైన ఢోఖ్ల తయారుఅయ్యింది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర