అడై దోస | Adai dosa Recipe in Telugu

ద్వారా Suma Naveen  |  20th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Adai dosa by Suma Naveen at BetterButter
అడై దోసby Suma Naveen
 • తయారీకి సమయం

  56

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

9

0

అడై దోస వంటకం

అడై దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Adai dosa Recipe in Telugu )

 • అడై దోస కి కావాల్సిన పదర్థాలు
 • బియ్యం - 2 గ్లాసులు
 • కందిపప్పు - 1 గ్లాసు
 • మినగుల్లు - 1/2 గ్లాసు
 • శెనగపప్పు -1/2 గ్లాసు
 • పెసరపప్పు - 1/2 గ్లాసు
 • మిరియాలు -1/4 లేదా 1/2 స్పూను
 • జీలకర్ర - 1/2 స్పూన్
 • ఎండుమిరపకాయలు - 4 లేదా 6
 • ఇంగువ - చిటికెడు
 • ఉప్పు- తగినంత
 • నీళ్లు - తగినంత
 • కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కావాల్సిన పదార్ధాలు
 • కొబ్బరి కోరు - పులుకి తగినంత
 • మామిడికాయ - 1 చిన్నది
 • నూనె - 2 స్పూన్
 • మెంతులు - 1/4 స్పూన్ కన్న తక్కువ
 • మిన్నపపు -1/4 స్పూన్ కన్న తక్కువ
 • ఆవాలు -1/4 స్పూన్ కన్న తక్కువ
 • ఇంగువ - చిటికెడు
 • ఉప్పు - తగినంత

అడై దోస | How to make Adai dosa Recipe in Telugu

 1. అడై దోస తయారి విధానము
 2. బియ్యం ,కందిపప్పు , మినపగుళ్లు, శెనగపప్పు ,పెసరపప్పు బాగా కడగి అప్పుడు ఓ గిన్నెలో నీళ్లు తీసుకొని విటినన్నిటిని నాన పెట్టాలి
 3. మిరియాలు ,జీలకర్ర , ఎండుమిరపకాయలు లను కూడా వేసుకోవాలి
 4. ఉదయం నాన పెడితే సాయంత్రం రుబ్బుకోవాలి
 5. నాన పెట్టుకున్న వాటిని వడ కొట్టి ,తగినంత ఉప్పు ,ఇంగువ వేసి ,నీళ్లు పోస్తూ రుబ్బుకోవాలి దోస పిండి లా
 6. అలా రుబ్బిన పిండికి గంట వ్యవధి ఇచ్చి ,అప్పుడు వేసుకోండి ఈ అడై దొశ లను
 7. స్టౌ వెలిగించి పెనం పెట్టీ నూనె రాస్తూ లేదా వేస్తూ వేసుకోండి దోశలు
 8. నిజానికి ఈ అడై దోస లను దళసరిగా వేస్తారు మా ఇంట్లో తినరు అందుకే పల్చగా వేస్తాను
 9. దళసరి కావాలంటే కొంచం గట్టిగా రబ్బుకోవాలి
 10. అంతే అడై దోస రెడీ
 11. దీన్ని ఏ చట్నీ తోనైనా తినవచ్చు
 12. నేను చేసింది కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి
 13. తయారి విధానము
 14. స్టౌ వెలిగించి పాన్ పెట్టీ మెంతులు ,ఎండుమిర్చి వేయించి ప్లేట్లో కి తీసుకోండి నూనె లేకుండా వేడి లేకుండా
 15. అదే నూనెలో ఇంగువ , మినపప్పు ,ఆవాలు పోపు పెట్టుకోండి దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని
 16. ఇప్పుడు మెంతులు, ఎండు మిర్చి రుబ్బు కోవాలి దాంట్లో మామిడికాయ కొబ్బరి కోరు ఉప్పు వేసి కచ్చాపచ్చగా రుబ్బుకోవాలి
 17. ఇలా రుబ్బుకున్న దాన్ని ముందుగా గిన్నెలో తీసుకున్న పోపు లో కలపండి
 18. అంతే పచ్చడి రెడీ
 19. గార్నిష్ కి ఉల్లిపాయ చక్రాలు కొత్తిమీర వాడాను

Reviews for Adai dosa Recipe in Telugu (0)