హోమ్ / వంటకాలు / కూరగాయల వేపుడు అన్నం ముడిబియ్యంతో

Photo of Veg fried rice with brown rice by Chandrika Marripudi at BetterButter
585
3
0.0(0)
0

కూరగాయల వేపుడు అన్నం ముడిబియ్యంతో

Dec-21-2018
Chandrika Marripudi
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కూరగాయల వేపుడు అన్నం ముడిబియ్యంతో రెసిపీ గురించి

వెజ్ ఫ్రైడ్ రైస్. నచ్చిన కూరగాయముక్కలు,అన్నంతో చేసుకునే రైస్ ఐటమ్. ప్రత్యేకంగా కూర ఏమీ లేకున్నా కూడా రైతా ఉంటే చాలు.పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం : 2 కప్పులు
  2. ఉల్లిపాయలు : 2
  3. పచ్చిమిర్చి : 4
  4. కాప్సికమ్ : 1
  5. బంగాళదుంపలు : 2
  6. టొమాటోలు : 4
  7. క్యారెట్ : 2
  8. అల్లం : చిన్నముక్క
  9. వెల్లుల్లి : 1పాయ
  10. ఉప్పు : తగినంత
  11. సోయాసాస్ : 1 స్పూన్
  12. గ్రీన్ చిల్లీ సాస్ : 1 స్పూన్
  13. మిరియాలపొడి : 2 స్పూన్
  14. నూనె : 6 స్పూన్లు
  15. జీలకర్ర : 1 స్పూన్
  16. కరివేపాకు : 2 రెమ్మలు
  17. కొత్తిమీర : కొద్దిగా

సూచనలు

  1. బియ్యం కడిగి ఒక గంటసేపు నానపెట్టుకుని పొడి పొడిగా అన్నం వండుకోవాలి.
  2. కూరగాయలను సన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  3. అల్లం,వెల్లుల్లి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  4. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక తరిగిన అల్లం,వెల్లుల్లి వేసి వేయించాలి
  5. తరువాత కూరగాయ ముక్కలు ఒకొకటిగా మొత్తం వేసి తగినంత ఉప్పు వేసి కలిపి వేయించుకోవాలి.
  6. కాసేపు వేగాక సోయాసాస్, గ్రీన్ చిల్లీసాస్,మిరియాలపొడి వేసి కలిపి మగ్గించుకోవాలి.
  7. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి అంతా కలిసేలా కలిపి 5 నిమిషాలు వేయించుకుని కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపెయ్యాలి.
  8. పెరుగు చిలికి క్యారెట్ తురుము, పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు,ఉప్పు వేసి కలిపి దానిమ్మగింజలు వేసి కలిపిన రైతాతో వడ్డించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర