హోమ్ / వంటకాలు / గోబీ 65 వెజ్ బిర్యానీ

Photo of Gobi 65 veg biryani by Ram Ram at BetterButter
970
3
0.0(0)
0

గోబీ 65 వెజ్ బిర్యానీ

Dec-21-2018
Ram Ram
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబీ 65 వెజ్ బిర్యానీ రెసిపీ గురించి

చాలా రుచిగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు వెరైటీ గా ఇలా చేసుకుని తినవచ్చు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. గోబీ ముక్కలు 1 కప్పు
  2. మైదా 4 స్పూన్లు
  3. కార్న్ ఫ్లోర్ 4 స్పూన్లు
  4. ఫుడ్ కలర్ చిటికెడు
  5. ఉప్పు సరిపడా
  6. కారం సరిపడా
  7. పచ్చి మిర్చి 5
  8. క్యారెట్ ముక్కలు 1/4 కప్పు
  9. ఆలూ ముక్కలు 1/4 కప్పు
  10. సొయా 1/4కప్పు
  11. నీళ్లు 2 1/2గ్లాసులు
  12. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు
  13. బియ్యం గ్లాస్
  14. నూనె సరిపడా
  15. జీడిపప్పు 6 బద్దలు
  16. బిర్యానీ దినుసులు

సూచనలు

  1. ముందుగా గోబీ ముక్కల్ని బాగా కడిగి వేడి నీళ్లలో వేసి తీసి ఒక గిన్నెలో వేసుకుని మైదా కార్న్ ఫ్లోర్ కారం ఉప్పు ఫుడ్ కలర్ వేసి కొద్దీ నీళ్లు వేసి కలుపుకోవాలి
  2. స్టవ్ మీద మూకుడ పెట్టి డీప్ ఫ్రై కి నూనె పెట్టి వేడి అయ్యాక గోబీ ముక్కలు నూనె లో వేయించి తీసుకోవాలి
  3. ఇప్పుడు కుక్కర్ పెట్టి నూనె 5 స్పూన్లు వేసి బిర్యానీ దినుసులు వేసి వేయించాలి
  4. ఇపుడు జీడిపప్పు సొయా పచ్చిమిర్చి కూరగాయ ముక్కలు వేసి వేయించుకోవాలి అల్లం వెల్లులి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి
  5. తర్వాత 1 గ్లాసు కడిగిన బియ్యం వేసి అంతా బాగా కలుపుకుని 3 నిమిషాలు వేగనివ్వాలి
  6. ఇప్పుడు 2 1/2 గ్లాసుల నీళ్లు వేసి సరిపడా ఉప్పు వేసుకుని మరగనివ్వాలి కుక్కర్ మూత పెట్టి 3 కూతలు వేయించుకోవాలి
  7. చల్లారిన తర్వాత మూత తీసి అంత ఒకసారి బాగా కలుపుకోవాలి
  8. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న గోబీ 65 వేసి కలుపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర