హోమ్ / వంటకాలు / పుదీనా కొబ్బరిపాల కోడికూర

Photo of Mint coconutmilk chicken curry by Chandrika Marripudi at BetterButter
387
2
0.0(0)
0

పుదీనా కొబ్బరిపాల కోడికూర

Dec-23-2018
Chandrika Marripudi
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా కొబ్బరిపాల కోడికూర రెసిపీ గురించి

కోడికూర పుదీనా, కొబ్బరిపాలు తో రుచికరంగా పుదీనా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 6

  1. కోడిమాంసం : 1 కేజీ
  2. ఉల్లిపాయలు : 2
  3. టొమాటోలు : 2
  4. పచ్చిమిర్చి : 4
  5. అల్లంవెల్లుల్లి పేస్టు : 2టేబుల్ స్పూన్లు
  6. పుదీనా : 1కట్ట
  7. పచ్చికొబ్బరి : 1 చిప్ప
  8. ఉప్పు : తగినంత
  9. కారం : 4 స్పూన్లు
  10. గరంమసాలాపొడి : 1 స్పూన్
  11. పెరుగు : 2 స్పూన్లు
  12. కొత్తిమీర : 1 కప్
  13. కరివేపాకు : 2 రెమ్మలు
  14. నూనె : 6 స్పూన్లు

సూచనలు

  1. కోడిమాంసం కడిగి శుభ్రం చేసి ఒక గిన్నెలోకి తీసుకుని ఉప్పు, కారం,పసుపు, అల్లంవెల్లుల్లిపేస్ట్,పెరుగు,2స్పూన్ల నూనె వేసి కలిపి పెట్టుకోవాలి.
  2. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక కరివేపాకు వేసి తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
  3. అవి కాస్త వేగాక తరిగిన టొమాటో ముక్కలు వేసి కలిపి మగ్గించుకోవాలి
  4. ఇప్పుడు వలిచి కడిగి పెట్టుకున్న పుదీనా వేసి కలిపి వేయించాలి.
  5. బాగా మగ్గించుకోవాలి
  6. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి.
  7. మూత పెట్టి మంట మీడియంగా పెట్టి ఉడికించుకోవాలి.
  8. పచ్చికొబ్బరి ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి నీళ్ళు పోసి తిప్పి కొబ్బరిపాలు తీసుకోవాలి
  9. వడకట్టి తీసుకున్న కొబ్బరిపాలను ఉడుకుతున్న కోడికూరలో పోసుకుని కలపాలి
  10. బాగా కలిపి గరంమసాలాపొడి వేసి మూత పెట్టి చిన్న మంటమీద 5 నిమిషాలు ఉడికించి కొత్తిమీర వేసి కలిపి దించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర