Vegetable stuffed home baked buns | Vegetable stuffed home baked buns Recipe in Telugu

ద్వారా Pasumarthi Poojitha  |  28th Dec 2018  |  
4 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Vegetable stuffed home baked buns by Pasumarthi Poojitha at BetterButter
Vegetable stuffed home baked bunsby Pasumarthi Poojitha
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    80

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

5

1

Vegetable stuffed home baked buns

Vegetable stuffed home baked buns తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vegetable stuffed home baked buns Recipe in Telugu )

  • మైదా 1 కప్
  • డ్రై ఈస్ట్ పొడి 1 టీ స్పూన్
  • ఉప్పు సరిపడా
  • నూనె 1 టేబుల్ స్పూన్
  • నీళ్లు సరిపడా
  • పంచదార 1 టేబుల్ స్పూన్
  • పచ్చి బటాని సగం కప్పు
  • బీన్స్ 4
  • క్యాప్సికమ్ సగం ముక్క
  • క్యారెట్ 1 సన్నగా కట్ చేసుకోవాలి
  • పచ్చి మిర్చి 1
  • జీరా 1 టేబుల్ స్పూన్
  • నూనె సరిపడా
  • దానియా పొడి 1 టేబుల్ స్పూన్
  • కారం 1 టేబుల్ స్పూన్
  • ఉల్లిపాయ 1
  • నువ్వులు 1 టేబుల్ స్పూన్

Vegetable stuffed home baked buns | How to make Vegetable stuffed home baked buns Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మైదా,ఉప్పు చిటికెడు,నూనె 1 టేబుల్ స్పూన్,డ్రై ఈస్ట్ పొడి 1 టీ స్పూన్ ,పంచదార ,నీళ్లు సరిపడా పోసుకొని ముద్దలా కలుపుకోవాలి. కొద్దిగా నూనె అద్ది గంట వరకు పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు కూరగాయలు అన్ని శుభ్రoగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మరియు ఉడికించిన పచ్చి బటాని కూడా తీసుకోవాలి
  3. స్టవ్ వెలిగించి కలై పెట్టి కొద్దిగా బటర్ వేసి జీరా,ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యారెట్,బీన్స్,క్యాప్సికమ్, బటాని,వేసుకొని కొంచం మగ్గిన తర్వాత ఉప్పు,కారం,ధనియా పొడి,వేసుకొని కలుపుకోవాలి.
  4. ఇప్పుడు గంట వరకు నానపెట్టిన పిండి ముద్ద ను కొంచెం తీసుకొని రౌండ్ గా చేసుకొని చపాతీ ల చేతిలో అద్దు కొని స్టఫింగ్ మిశ్రమాన్ని పెట్టి క్లోజ్ చేయాలి.
  5. ఇలా అన్ని చేసుకొని ఒక 15 నిమిషాలు పాటు పక్కన ఉంచుకోవాలి.
  6. ఇప్పుడు సన్న మంట మీద ఒక పెద్ద కలై పెట్టుకొని కలై లో ఒక ప్లేట్ బోర్లా వేసి 15 నిమిషాలు వేడి చేయాలి.
  7. ఇప్పుడు స్టఫ్ చేసుకొని పెట్టుకుని ఉన్న వాటిని కలై లో పెట్టుకొని 20,28 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి మధ్యలో ఒక సారి నూనె రాసి నువ్వులు జల్లుకోవాలి ,మధ్య మధ్య లో నూనె బ్రష్ చేస్తూ ఉండాలి. రంగు మారె వరకు.
  8. ఇలా రంగు రావాలి. స్టఫ్డ్ బన్స్ రెడి. సాస్ తో చాలా బాగున్నాయి.

Reviews for Vegetable stuffed home baked buns Recipe in Telugu (1)

Shobha.. Vrudhullaa year ago

Yummy
జవాబు వ్రాయండి
Pasumarthi Poojitha
a year ago
thank u