హోమ్ / వంటకాలు / కస్టర్డ్ లో చాక్లెట్ బాల్స్

Photo of CHOCOLATE balls in CUSTARD by Shobha.. Vrudhulla at BetterButter
31
3
0.0(0)
0

కస్టర్డ్ లో చాక్లెట్ బాల్స్

Dec-28-2018
Shobha.. Vrudhulla
50 నిమిషాలు
వండినది?
90 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కస్టర్డ్ లో చాక్లెట్ బాల్స్ రెసిపీ గురించి

చాక్లెట్ మరియ కస్టర్డ్ కలిపిన ఈ ఐటెంచాల బాగుంటుంది.ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా బాగా ఉండటం వల్ల పిల్లలు చాలా ఇష్టముగా తింటారు.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • పిల్లల పుట్టినరోజు
 • భారతీయ
 • చల్లగా చేసుకోవటం
 • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

 1. కస్టర్డ్ కోసం.....
 2. పాలు 1 లీటర్
 3. పంచదార 2 కప్పులు
 4. కస్టర్డ్ పౌడర్ 3 చంచాలు వెనిల్లా
 5. చాక్లెట్ బాల్స్ కోసం........
 6. 5 కానీ 6 కానీ లేక 2 పాకెట్స్ ఒరియా బిస్కెట్స్ చాక్లెట్ ఫ్లెవేర్
 7. జీడిపప్పు 10
 8. కిస్మిస్ 15
 9. బాదం పప్పు 10
 10. పిస్తా పప్పు 3.to ..4...చంచాలు
 11. చోకో చిప్స్ 3 to 4 చంచాలు
 12. చోకాలేటె వెర్మిసెల్లి 2 to 3 చంచాలు..
 13. చాక్లెట్ వెర్మిసెల్లి కలర్స్ వి 1 చెంచా
 14. చెర్రీ 5
 15. గోధుమ బ్రెడ్ 6 పీసెస్
 16. పాలు 1 కప్పుడు

సూచనలు

 1. ముందుగా పాలల్లో పంచదార వేసి బాగా కాగా పెట్టాలి.ఒక కప్పులో చల్లటి పాలు తీసుకొని అందులో కస్టర్డ్ కలిపి ఉండలు లేకుండా మరుగుతున్న పాలల్లో పోసి బాగా కలుపుతూ ఉండాలి దగ్గర పడే వరకు.
 2. చిక్కగా అయ్యాక కిందకు దించి చల్లారనివ్వాలి.
 3. చాకలెట్ బాల్స్..... ఒరియా చాక్లెట్ బిస్కెట్స్ ని మధ్యలో ఉన్న క్రీమ్ తోనే ముక్కలు చేసి మిక్సీ లో వేసి పొడి చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి
 4. ఆ పొడిలో డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్న ముక్కలు చేసి వేయాలి.అందులోనే చోకో చిప్స్ కూడా ఒక చంచాడు వేసి తయారు చేసి ఉంచిన కస్టర్డ్ కూడా 2 చంచాలు వేసి బాగా కలపాలి
 5. కలిపిన తరువాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టి పక్కన పెట్టుకోవలెను.
 6. ఇప్పుడు బ్రెడ్ కి అంచులు కట్ చేసి తీసి మిగిలిన బ్రెడ్ ను ఒక కప్పుడు ఉంచిన పాలల్లో ముంచి తీసి గట్టిగా నొక్కి బ్రెడ్ లోంచి కూడా పాలు పిండ వలెను
 7. అప్పుడు చాకలెట్ బాల్ ని యి బ్రెడ్ లో పెట్టి గట్టిగా ఉండ చుట్టి పక్కన పెట్టు కోవలెను.అలాగే అన్ని బాల్స్ కి కూడా బ్రెడ్ లో చుట్టి పెట్టాలి..
 8. ప్లేటింగ్....
 9. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 కానీ 3 కానీ చాక్లెట్ బాల్స్ పెట్టి ముందుగా తయారు చేసి ఉంచిన కస్టర్డ్ ని యి బాల్స్ మీదనుంచి వేయాలి.మొత్తము బాల్స్ మించి కప్పేలా వేయాలి.
 10. అప్పుడు విటిమీద డ్రై ఫ్రూట్స్ తో యింకా చోకో చిప్స్ తో చాక్లెట్ వెర్మి సెల్లి తో కలర్స్ వెర్మిసెల్లి తో కూడా బాగా అలంకరించాలి.ఆఖరికి వీటి మీద పిక్ లో చూపించి నట్టు చెర్రీ కూడా పెట్టాలి.
 11. అంతే కస్టర్డ్ లో చాక్లెట్ బాల్స్ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర