హోమ్ / వంటకాలు / డ్రై ఫ్రూప్ట్స్ బర్ఫీ

Photo of Dry fruits barfi by Kathi Mamatha at BetterButter
544
6
0.0(0)
0

డ్రై ఫ్రూప్ట్స్ బర్ఫీ

Dec-28-2018
Kathi Mamatha
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రై ఫ్రూప్ట్స్ బర్ఫీ రెసిపీ గురించి

తయారు చేయు విధానము

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఇతర
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. ఖజ్జురాలు 2కప్స్
  2. వాల్నుట్స్ 1/2 కప్
  3. జీడిపప్పు 1/2కప్
  4. బాదాం 1/2కప్
  5. పిస్తా పప్పు 1/4కప్
  6. గసగసాలు 2tbsp
  7. జాజికాయ పొడి 1tsp
  8. యాలకుల పొడి 1tsp
  9. నెయ్యి 2tbsp

సూచనలు

  1. ముందుగా అన్ని డ్రైఫ్రూప్ట్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి
  2. ఖజ్జురాలలోని గింజల్ని తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి
  3. ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని స్టవ్ పైన పెట్టి వెలిగించుకోవాలి. వేడి అయ్యాక ముక్కలుగా చేసుకొన్న డ్రైఫ్రూప్ట్స్ అందులో వేసి వేయించుకోవాలి.పిస్తా పప్పు వెయ్యొద్దండోయ్
  4. వేయించిన తరువాత అవి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
  5. మళ్ళీ మూకుడు స్టవ్ పైన పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి.ఇప్పుడు అందులో గసగసాలు వేసి 2నిముషాలు వేయించుకోవాలి.
  6. గసగసాలు వేగాకా కొన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోని మిగితా సామాగ్రి అన్ని వేసుకోని బాగా కలుపుకోవాలి.
  7. అంతా కలిసాక స్టవ్ కట్టేసి ఆ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
  8. చేతులకు నెయ్యి కొంచెం రాసుకొని మిశ్రమాన్ని అంతా ఒక దగ్గరికి చేసుకోవాలి.
  9. మిశ్రమాన్ని అంతా సీలిండ్రికల్ షేప్ లోకి తెచ్చుకోవాలి రెండు చేతుల సహాయం తో చేసుకోవాలి
  10. ఇప్పుడు బర్ఫీ ని గసగసాల్ వేసుకొన్న ప్లేట్ లో ఒకసారి రోల్ చేసుకోవాలి అవి బయట నుంచి అంటుకోవాలి అన్నమాట.
  11. ఇప్పుడు ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకోని బర్ఫీ ని ప్యాక్ చేసుకోవాలి. దాన్ని 2గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి
  12. 2గంటల తరువాత బయటకి తీసి అల్యూమినియం ఫాయిల్ తీసేయాలి.ఇప్పుడు 1/2cm ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  13. ఖజ్జురా డ్రై ఫ్రూప్ట్స్ బర్ఫీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర