హోమ్ / వంటకాలు / బంగాళదుంప ఫింగర్స్

Photo of Crispy potato fingers by Lalitha Kandala at BetterButter
780
5
0.0(0)
0

బంగాళదుంప ఫింగర్స్

Dec-30-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప ఫింగర్స్ రెసిపీ గురించి

పిల్లలకు నచ్చే స్నాక్ బంగాళదుంప లతో వేడిగా క్రిస్పీ గా ఉండే ఫింగర్స్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బంగాళాదుంపలు పెద్దవి 2
  2. బొంబాయి రవ్వ 1/2 కప్
  3. ఉప్పు కొద్దిగా
  4. కారం కొద్దిగా
  5. గరం మసాలా 1/4th టీ స్పూన్
  6. వాము 1/4th టీ స్పూన్
  7. కొత్తిమీర గుప్పెడు
  8. నూనె వేయించటానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా బంగాళదుంప లు ఉడికించి చల్లార్చి ముద్దలా చేసుకోవాలి
  2. ఒక గిన్నెలో 1 కప్ నీళ్లు పోసి బాగా మరిగించి బొంబాయి రవ్వ వేసి ఉడికించి చల్లారనివ్వాలి
  3. బంగాళదుంప ల మిశ్రమంలో ఈ రవ్వ ముద్ద వేసి బాగా కలపాలి
  4. అందులోనే ఉప్పు, కారం, వాము, గరం మసాలా కొత్తిమీర వేసి బాగా కలపాలి
  5. మిశ్రమాన్ని బాగా కలిపి చేతికి నూనె రాసుకుని పొడుగ్గా చేసుకోవాలి.
  6. ఇలాగే అన్ని లావుగా ఫింగర్స్ చేసుకుని కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి
  7. నూనె బాగా వేడి చేసి ఈ ఫింగర్స్ కొద్ధి కొద్దిగా వేసి వాటిని బాగా డీప్ ఫ్రై చేయాలి
  8. బంగారు రంగు వచ్చాక వాటిని ప్లేట్ లో తీసుకుని సాస్ తో సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర