హోమ్ / వంటకాలు / మిక్స్డ్ ఫ్లోర్స్ ఇన్స్టెంట్ మినీ ఊతప్పo

Photo of Mixed flours instant mini uthappam  by sneha gilla at BetterButter
385
3
0.0(0)
0

మిక్స్డ్ ఫ్లోర్స్ ఇన్స్టెంట్ మినీ ఊతప్పo

Dec-30-2018
sneha gilla
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిక్స్డ్ ఫ్లోర్స్ ఇన్స్టెంట్ మినీ ఊతప్పo రెసిపీ గురించి

అన్ని రకాల పిండ్లు మరియు రవ్వలు కలిపి చేసిన ఊతప్ప. ఇవి చాలా రుచిగా ఉంటాయి.పిల్లలు కూడా ఇలా చిన్న చిన్నగా చేయటం వల్ల ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమపిండి 1/2 కప్
  2. బియ్యపు పిండి 1/2 కప్
  3. శనిగ పిండి 3 స్పూన్స్
  4. ఇడ్లీ రవ్వ 3 స్పూన్స్
  5. బొంబాయి రవ్వ 3 స్పూన్స్
  6. ఉప్పు సరిపడా
  7. పెరుగు 1/2 కప్
  8. ఆయిల్ కొద్దిగా
  9. క్యారెట్ తురుము 1/2 కప్
  10. ఆనియన్ తరుగు 1/2 కప్
  11. పచ్చిమిర్చి 2 చిన్న చిన్న గా కట్ చేసినవి
  12. కొత్తిమీర తరుగు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో గోధుమపిండి,బియ్యపుపిండి,శనిగ పిండి,ఇడ్లీ రవ్వ,బొంబాయి రవ్వ,పెరుగు,ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి దోస పిండిలా కలుపుకోవాలి.
  2. రవ్వ వేసాం కాబట్టి అది నానడానికి 10 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
  3. క్యారెట్,ఆనియన్,పచ్చిమిర్చి,కొత్తిమీర అన్ని కలిపి పక్కనపెట్టుకోవాలి.
  4. ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక చిన్న చిన్న దోశల్లా వేసి వాటిపైన ముందుగా కలిపి పెట్టుకున్న కూరగాయల మిశ్రమాన్ని వేసి వేగనివ్వాలి.
  5. ఒక వైపు వేగాక రెండో వైపు కూడా వేయించుకొని సర్వ్ చేసుకోవాలి.
  6. ఇన్స్టెంట్ ఊతప్ప రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర