హోమ్ / వంటకాలు / మినీ ఊతప్పం/బేబీ ఊతప్పం ప్లాటర్

Photo of Mini Utappam platter by Sudha Badam at BetterButter
772
4
0.0(0)
0

మినీ ఊతప్పం/బేబీ ఊతప్పం ప్లాటర్

Dec-30-2018
Sudha Badam
40 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినీ ఊతప్పం/బేబీ ఊతప్పం ప్లాటర్ రెసిపీ గురించి

పిల్లలకి ఇష్టమైన రకరకాల toppingsతో చేసుకునే ఊతప్పం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఊతప్పం పిండి కి
  2. మినపప్పు 1 కప్పు
  3. బియ్యం 1 కప్పు
  4. దంపుడు బియ్యం 1 కప్పు
  5. అటుకులు గుప్పెడు
  6. Toppings కి
  7. క్యారెట్ 1
  8. బీట్రూట్ 1
  9. టమాటా 1
  10. ఉల్లిపాయ పెద్దది 1
  11. క్యాప్సికమ్ చిన్నది 1
  12. స్వీట్ కోర్న్ గింజలు 2 గుప్పెడ్లు
  13. చీజ్ 100 గ్రాములు
  14. చిల్లి ఫ్లేక్స్ 2 స్పూన్లు
  15. కొత్తిమీర అర కట్ట
  16. కీరదోసకాయ సగం
  17. అల్లం 2 అంగుళాల ముక్క
  18. పచ్చిమిర్చి 6
  19. జీలకర్ర 1 స్పూను
  20. ఉప్పు తగినంత
  21. నూనె ఊతప్పాలు కాల్చుకోడానికి

సూచనలు

  1. ముందుగా మినపప్పు, బియ్యం 6 గంటల పాటు నానబెట్టి రుబ్బుకుని అటుకులు కూడా వేసి మరో సారి రుబ్బి 6 గంటలు ఫర్మెంట్ అవ్వనివ్వాలి.
  2. ఊతప్పలు వేసుకునే ముందు ఆ పిండిలో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  3. క్యారెట్, బీట్రూట్,చీజ్ సన్నగా తురుముకోవాలి. మిగతా కాయగూరలన్ని సన్నగా తరుగుకోవాలి.
  4. స్వీట్ కార్న్ కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి ఉంచుకోవాలి.
  5. Toppings కోసం 1.ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర 2.క్యారెట్, బీట్రూట్ 3.క్యాప్సికమ్, టమాటా, కొత్తిమీర 4.స్వీట్ కార్న్, క్యాప్సికమ్, కొత్తిమీర 5.అల్లం, పచ్చిమిర్చి,జీలకర్ర 6.చీజ్ తురుము, చిల్లి ఫ్లేక్స్ 7.కీరదోసకాయ, టమాటా, కొత్తిమీర
  6. ఇలా అన్ని రకాలు రెడి చేసుకుని చిన్న చిన్న ఊతప్పలు వేసుకుని వాటి మీద ఈ toppings వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి.
  7. ఇంకా చిన్నగా వేసుకుని బేబీ ఊతప్పలు కూడా రెడి చేస్కోవచ్చు.
  8. నచ్చిన చట్నీ తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర