పెరుగు కేక్ గుడ్డు లేకుండా(పైన తేన & జామ్) | Eggless Curd cake(with honey & fruit jam topping) Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  31st Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Eggless Curd cake(with honey & fruit jam topping) by Pravallika Srinivas at BetterButter
పెరుగు కేక్ గుడ్డు లేకుండా(పైన తేన & జామ్)by Pravallika Srinivas
 • తయారీకి సమయం

  2

  గంటలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

3

0

పెరుగు కేక్ గుడ్డు లేకుండా(పైన తేన & జామ్)

పెరుగు కేక్ గుడ్డు లేకుండా(పైన తేన & జామ్) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Eggless Curd cake(with honey & fruit jam topping) Recipe in Telugu )

 • కేక్ కి కావాల్సిన పదార్ధాలు :-
 • మైదా 1 కప్పు
 • చెక్కర - ముప్పావు కప్పు
 • పెరుగు - అరకప్పు
 • నూనె - అరకప్పు
 • బేకింగ్ పొడి - 1.5 స్పూను
 • బేకింగ్ సోడా - అరస్పూను
 • వనిల్లా ఎస్సెన్స్ - పావు స్పూను
 • తేనె పాకం కి కావాల్సిన పదార్ధాలు : -
 • చెక్కర - 2 స్పూన్లు
 • నీరు తగినంత
 • తేనె - సరిపడా
 • ఫ్రూట్ జామ్ సరిపడా
 • నిమ్మరసం - 4 చుక్కలు

పెరుగు కేక్ గుడ్డు లేకుండా(పైన తేన & జామ్) | How to make Eggless Curd cake(with honey & fruit jam topping) Recipe in Telugu

 1. ముందుగా పంచదారను మిక్సర్ జార్ లో పొడి కట్టుకోవాలి.
 2. పెరుగును బాగా ఉండలు లేకుండా చిల్లకొట్టుకోవాలి.
 3. ఒక బేషన్ లో మైదా,బేకింగ్ పొడి,బేకింగ్ సోడా ,ముందుగా పొడి చేసిన పంచదార అన్ని కలిపి పెట్టుకోవాలి.
 4. తడిపిండి వేసే మిక్సర్ జార్ లో కలిపిన పొడి మిశ్రమం,చిలికిన పెరుగు,నూనె వేసి బాగా కలిసేట్టుగా గ్రైండ్ చేసుకోవాలి.
 5. గట్టిగా ఉంటే కొంచం నీరు వేసి ,వెనిల్ల ఎస్సెన్స్ వేసి మరలా కలిసేట్టుగా గ్రైండ్ చేసుకోవాలి.
 6. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకుని పేరిన నెయ్యి రాసి పైన మైదా పిండి చల్లుకుని బాగా కోట్ చేసుకోవాలి.
 7. తయారైన పిండిని అందులో వేసుకోవాలి .ట్రే కి సగం ఉండేంత వరకు మాత్రమే వేసుకోవాలి.
 8. ట్రే మీద మూత పెట్టి రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి.
 9. ఇప్పుడు ఒక కుక్కర్ లో ఇసుక లేదా ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు కాలనివ్వాలి.
 10. ఇసుకలో స్టాండ్ పెట్టి పైన ట్రే పెట్టి కుక్కర్ విస్టల్,గాస్కెట్ తీసి మూత పెట్టి ఒక 40 నిమిషాలు బేక్ చేసుకోవాలి.
 11. మధ్య మధ్యలో పుల్లతో చెక్ చేసుకోవాలి .
 12. స్టవ్ ఆపి ఒక 5 నిమిషాల తర్వాత ట్రే తీసి ఒక ప్లేట్ లో రివర్స్ చేసి ట్రే మెల్లగా తీసి వేయాలి.
 13. కేక్ చివర్లు బాగా కాలి ఉంటుంది వాటిని కట్ చేసుకోవాలి.
 14. ఇప్పుడు తేనె పాకం కోసం పంచదార వేసి మునిగేంత నీరు వేసి కరిగించి ,ఫ్రూట్ జామ్ వేసి కలుపు కోవాలి.
 15. ఇందులో నిమ్మరసం 3 లేదా 4 చుక్కలు వేసి కలుపుకోవాలి. చివరిగా తేనే వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.
 16. కేక్ ని సెర్వింగ్ ప్లేట్ లో పెట్టి కేక్ కి పైన ఫోర్క్ తో గుచ్చి ఈ తేనె పాకం కొంచం కొంచం స్పూన్ తో వేసి పరుచుకోవాలి.
 17. అంతే ఎంతో రుచికరంగా ఉండే పెరుగు కేక్ తేనె పాకం తో సిద్ధం.

నా చిట్కా:

పెరుగు వెన్న ఉన్న పాలతో అప్పుడే ఇంట్లో తయారు చేసినది వేయకుంటేనే కేక్ కమ్మగా వస్తుంది.పిల్లలకు ఇష్టమైనవి అలంకరించుకోవచ్చు

Reviews for Eggless Curd cake(with honey & fruit jam topping) Recipe in Telugu (0)