హోమ్ / వంటకాలు / వెజ్ మాకరోని భారతీయ శైలి లో

Photo of VEG Macaroni by Anitha Rani at BetterButter
789
8
0.0(0)
1

వెజ్ మాకరోని భారతీయ శైలి లో

Dec-31-2018
Anitha Rani
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ మాకరోని భారతీయ శైలి లో రెసిపీ గురించి

మన దేశములో దొరికే పదార్థములతో,ఆకుపచ్చని కూరగాయలతో భారతీయ శైలిలో తయారు చేసాను.భోజనానికి ముందు తింటారు...పిల్లలకు స్కూల్ కు లంచ్ బాక్స్ లో పెడితే ఇష్టము గా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • ఉడికించాలి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. మాకరోని 200 గ్రా
  2. ఉల్లిపాయలు 2.
  3. టమోటా ముక్కలు 1కప్
  4. కాప్సికమ్ ముక్కలు 1కప్
  5. కారెట్ ముక్కలు 1కప్
  6. నూనె 2 చెంచాలు
  7. ఉప్పు సరిపడా
  8. పసుపు1/2 టేబుల్ స్పూన్
  9. పచ్చిమిరప కాయలు 4
  10. కొత్తిమీర కొద్దిగా
  11. కరివేపాకు 10 రెబ్బలు
  12. జీలకర్ర1/2 స్పూన్
  13. టమోటా సాస్ 1స్పూన్
  14. అల్లము పేస్ట్ 1/2 స్పూన్
  15. స్వీట్ కార్న్..4చెంచాలు

సూచనలు

  1. స్టవ్ పైన గిన్నె పెట్టి 1కి 3 నీరు పోసి 1స్పూన్ ఉప్పు,1/2నూనె వేసి మూత పెట్టాలి.
  2. నీరు మరిగిన తరువాత మకరోని వేసి కలియ బెట్టాలి.
  3. 5ని తరువాత ఉడికినవి చూసుకొని చిల్లుల గిన్నెలో వడ బెట్టు కోవాలి.
  4. వాటిమీద చల్లటి నీరు వేసుకోవాలి.
  5. స్టవ్ మీద బాండీ పెట్టి వేడి అయ్యాక నూనె వేసి అందులో జీలకర్ర కరివేపాకు వేగ నివ్వాలి.
  6. అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేగాక ,టమోటో ముక్కలు, కాప్సికమ్ ముక్కలు,కారెట్ ముక్కలు వేసి మూత పెట్టాలి.
  7. 2ని తరువాత మూత తీసి అందులో ఉప్పు,పసుపు వేసి కలియ బెట్టాలి.
  8. అంతా కలిపిన తరువాత మాకరోని వేసి కూరగాయ ముక్కలు లో కలిసేటట్లు కలుపు కోవాలి.
  9. ఉప్పు చూసుకొని వేసు కోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి
  10. టొమోటో కచప్ వేసుకొని మరల కలుపు కోవాలి.
  11. వేడి గా సర్వ్ చేసుకుంటే పిల్లలు ఇష్టము తింటారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర