బీన్స్ కర్రీ | Beans Curry Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  31st Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Beans Curry recipe in Telugu,బీన్స్ కర్రీ, Gadige Maheswari
బీన్స్ కర్రీby Gadige Maheswari
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

బీన్స్ కర్రీ వంటకం

బీన్స్ కర్రీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Beans Curry Recipe in Telugu )

  • బీన్స్ - 1/4 కెజీ
  • ఉల్లిపాయలు - 2
  • పచ్చిమిర్చి - 4
  • ఉప్పు తగినంత
  • ధనియాలపొడి - 2 స్పూన్లు
  • పచ్చి కొబ్బరి తురుము - 1/2 కప్
  • నూనె తగినంత
  • కోత్తీమీర కరివేపాకు కోద్దిగా
  • టోమాటో - 1
  • పసుపు చిటికెడు
  • అల్లం వెల్లుల్లి ముద్ద - 1 స్పూన్

బీన్స్ కర్రీ | How to make Beans Curry Recipe in Telugu

  1. ముందుగా బీన్స్ ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  3. స్టౌ మీద పాన్ ఉంచి కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.
  4. ఆ తర్వాత ఇందులోనే బీన్స్ ముక్కలు పసుపు వేసి వేయించాలి.
  5. అవి కోంచెం వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకొన్న టమోటో ముక్కలు ధనియాలపొడి వేసి తగినంత ఉప్పు నీరు పోసి కలిపి మూత పెట్టి ఉడికించాలి.
  6. ఆ తర్వాత ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము కోత్తీమీర తరుగు వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉంచి దించేయాలి.
  7. అంతే నండి ఎంతో రుచిగా వుండే బీన్స్ కూర రెడీ.

Reviews for Beans Curry Recipe in Telugu (0)