Photo of HONEY cake by Kavitha Perumareddy at BetterButter
1091
3
0.0(1)
0

HONEY cake

Jan-04-2019
Kavitha Perumareddy
30 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమపిండి ఒకటిన్నర కప్స్
  2. పంచదార పొడి 1 కప్
  3. సిరప్ కోసం 5 స్పూన్స్ పంచదార
  4. తేనె 1 కప్
  5. వెన్న 1 కప్
  6. రిఫిన్డ్ ఆయిల్ పావు కప్
  7. కలర్స్ షుగర్ చిప్స్ ఒక కప్
  8. బేకింగ్ సోడా పావు స్పున్
  9. బేకింగ్ ఫావడర్1 స్పున్
  10. వెనీలా ఎస్సెన్స్ పావు స్పున్
  11. పాలు చిన్న కప్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో పంచదార పొడి వెన్న వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి .
  2. తరువాత సగం కప్ తేనె,బేకింగ్ సోడా ,బేకింగ్ ఫావడర్ ,పాలు,నూనె,వెనీలా ఎస్సెన్స్ వేసి బాగా కలుపుకోవాలి .తరువాత గోధుమపిండి కూడా వేసి అంతా కలిసేలా బాగా కలపాలి .షుగర్ చిప్స్ కూడా వేసి కలపాలి.
  3. అంతా బాగా మృదువుగా వచ్చేవరకు కలుపుకోవాలి.దోసె పిండిలా కొద్దిగా గట్టిగా ఉండాలి మరీ జారుడుగా వద్దు.అవసరం ఐతే ఇంకా కొన్ని పాలు కలుపుకోవచ్చు.
  4. ఇప్పుడు ఒక గిన్నె తీసికొని దానిలో వెన్న రాసి కొద్దిగా పిండి వేసి కోటింగ్ చేసుకోవాలి .ఇలా
  5. ఇలా చేసుకున్న గిన్నెలో కలిపిన కేక్ మిశ్రమం వేసుకోవాలి .పైన మిగిలిన షుగర్ చిప్స్ వేసి అలంకరించాలి.
  6. ఇప్పుడు పోయిమీద కుక్కర్ పెట్టి వేడి చేసుకున్న తరువాత లోపల స్టీల్ స్టాండ్ పెట్టాలి.
  7. దానిమీద కేక్ గిన్నె పెట్టుకోవాలి.
  8. కుక్కర్ కు మూత పెట్టుకొని మంట మధ్యస్తంగా పెట్టుకొని 40 నిముషాలు ఉడికించాలి .తరువాత ఒక స్పూన్ గుచ్చి చూస్తే పిండి అంటుకోకుండా ఉంటే కేక్ ఉడికినట్లే .లేదంటే ఇంకో 5 నిముషాలు ఉంచాలి.ఇప్పుడు కేక్ రెడీ.
  9. ఇప్పుడు పోయిమీద ఒక గిన్నె పెట్టి 5 స్పున్ చెక్కర కొద్దిగా నీళ్లు వేసి చెక్కర కరిగిన తరువాత మిగిలిన తేనె వేసి కలపాలి ...పాకం రావాల్సిన అవసరం లేదు ...ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ.
  10. ఇప్పుడు కేక్ కు ఫోర్క్ తో అంతటా గుచ్చుకోవాలి...తరువాత షుగర్ తేనె సిరప్ కేక్ మీద అంతటా వేసుకోవాలి .అంతే హనీ కేక్ రెడీ ...ఇంకా కావాలి అంటే పైన క్రీమ్ తో అలంకరించుకోవచ్చు.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Gadige Maheswari
Jan-05-2019
Gadige Maheswari   Jan-05-2019

Yummy :yum::heart_eyes:

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర