హోమ్ / వంటకాలు / బ్లాక్ ఫారెస్ట్ కేక్ గుడ్డు లేనిది

Photo of Eggless black forest cake by Shobha.. Vrudhulla at BetterButter
493
3
0.0(0)
0

బ్లాక్ ఫారెస్ట్ కేక్ గుడ్డు లేనిది

Jan-04-2019
Shobha.. Vrudhulla
60 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్లాక్ ఫారెస్ట్ కేక్ గుడ్డు లేనిది రెసిపీ గురించి

ఇందులో చాక్లెట్ ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకి చాలా నచ్చుతుంది.. ఎంతో ఇష్టంగా కూడా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • బేకింగ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 8

  1. కేక్ కోసం..
  2. మైదా 1 కప్..125 గ్రామ్స్
  3. బట్టర్1/4కప్
  4. చిన్న చంచాడు బేకింగ్ సోడా 1/2 tsp
  5. బేకింగ్ పొడి 1.5 tsp
  6. కండేన్స్డ్ మిల్క్ 200 grms
  7. కోకో పొడి 2 tbsp
  8. వెనిల్లా అస్సెన్స్ 1tsp
  9. నీళ్లు100 ml approx
  10. ఉప్పు బెక్ చేయటానికి 1 కప్
  11. ఐసింగ్ చేయటానికి.....
  12. పంచదార. 1/3కప్
  13. పంచదార పొడి 2 to 3 tbsp
  14. విప్పింగ్ క్రీమ్ 400 గ్రామ్స్
  15. చేరిస్ 1/2కప్
  16. డార్క్ చాక్లెట్ కొరినది 1 కప్
  17. షుగర్ సిరాప్ 1కప్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా..సోడా..బేకింగ్ పొడి..కోసి పొడి వేసి జల్లించి అది బాగా మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి
  2. ఇప్పుడు మరొక గిన్నెలో బట్టర్...వెనిల్లా అస్సెన్స్...కండేంజడ్ మిల్క్ వేసి బాగా కలిపి అప్పుడు అందులో నీళ్లు పోసి బాగా తిప్పాలి స్మూత్గా వచ్చేదాకా.
  3. అప్పుడు అందులో ముందుగా ఉంచిన పొడి మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా అంత కలిసి స్మూత్గా వచ్చేవరకు తిప్పాలి యి కేక్ మిశ్రమాన్ని.
  4. ఇప్పుడు కేక్ ఎందులో చేస్తామో అందులో ఆయిల్ తొ గ్రీస్ చేసి మైదా వేసి మిగిలిన మైదా తీసేసి వీలయితే అడుగున 1 బట్టర్ పేపర్ ని పెట్టి అందులో యి కలిపి ఉంచిన కేక్ మిశ్రమాన్ని వేయాలి.తరువాత టిన్ కి కొంచెం టాప్ చేస్తే లోపల గాలి లేకుండా ఉండును
  5. స్టవ్ మీద ముందే కుక్కర్ పెట్టి ఉప్పు వేసి గెస్కేట్ పెట్టి మూత పెట్టి ముందుగా వేడిచేసాక అప్పుడు తయారు చేసి ఉంచిన కేక్ మిశ్రమాన్ని యి కుక్కర్ లో పెట్టి మూత పెట్టి 15 to 20 mnts వరకు స్టవ్ కి మీడియం లో ఉంచి కేక్ బాకె చేయాలి
  6. 20 mnts తరువాత అయిందో లేదు టూత్పిక్ తొ గుచ్చి చూడాలి తడి లేకుండా ఉంటే అయినట్టే.తడి ఉంటే మరో 5mnts ఉంచితే అయిపోతుంది కేక్.
  7. స్టవ్ మీద ఒక కప్పు పంచదార అరా కప్పు నీళ్లు పోసి బాగా మరిగించి దించి పక్కన పెట్టుకోండి
  8. బయటకు తీసి చల్లారేక దానికి 3 భాగాలుగా చేసి ఒక్కొక్క బాగానికి ముందు బాగా షుగర్ సిరప్ వేసి దాని మీద విప్పేడ్ క్రీమ్ రాసి చిన్న చిన్న ముక్కలు చోకో చిప్స్ మరియు చిన్నా ముక్కలుగా కట్ చేసిన చేరిస్ వేయాలి
  9. ఇలాగే 3 లేయర్స్ చేసి అప్పుడు మొత్తం కేక్ చుట్టూ విప్పేడ్ క్రీమ్ బాగా ఎత్తు పల్లాలు లేకుండా రాసి పూర్తిగా క్రీమ్ తొ కప్పిన తరువాత దాని మీద క్రీమ్ తో ఫాలెవెర్స్ మనకు నచ్చిన ఆకారంలో డిజైన్ చేసి చుట్టూ మీద అప్పుడు వాటి మీద చేరిస్ పెట్టాలి చక్కగా
  10. ఇప్పుడు చుట్టూ కోరి ఉంచిన చాక్లెట్ ని చక్కగా క్రీమ్ మీద అడ్డుతు పూర్తిగా కవర్ చేయాలి లేదా మనకు నచ్చినట్టు కూడా చేయొచ్చును.మధ్యలో కావాలంటే చోకో చిప్స్ కూడా పెట్టుకోవచ్చు
  11. అంతే ఎంతో రుచి అయిన పిల్లలకు నచ్చిన బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెడి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర