హోమ్ / వంటకాలు / బ్రోకలీ సూప్ తో వెజ్ చీజ్ శాండ్విచ్.

Photo of Broccoli soup with veg cheese sandwich. by Swapna Tirumamidi at BetterButter
469
4
0.0(0)
0

బ్రోకలీ సూప్ తో వెజ్ చీజ్ శాండ్విచ్.

Jan-04-2019
Swapna Tirumamidi
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రోకలీ సూప్ తో వెజ్ చీజ్ శాండ్విచ్. రెసిపీ గురించి

పిల్లలు బ్రకొలి తినడానికి పేచీ పెడుతున్నారా.ఐతే ఇలా సూప్ లా చేసి పెట్టండి.పక్కనే శాండ్విచ్ కూడా పెడితే ఆరోజుకి పిల్లలకు పూర్తి ఆహారం అందినట్టే చేసి పెట్టండి తప్పక ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • కలయిక
  • మిళితం
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సూప్ కి...బ్రోకలీ ముక్కలు 2 కప్పులు
  2. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు
  3. కారం 4 చిటికెళ్ళు
  4. బిర్యానీ ఆకులు 2
  5. దాల్చిన చెక్క 1 అంగుళం ముక్క
  6. తరిగిన సెలరీ అరకప్పు
  7. కేరేట్ ముక్కలు అర కప్పు
  8. వెల్లుల్లి రెబ్బలు 2 సన్నగా తరగాలి.
  9. దిల్ ఆకులు కొద్దిగా
  10. పుదీనా ఆకులు 3..4 అలంకరణకు
  11. బట్టర్ కొద్దిగా
  12. ఆలివ్ నూని ఒక చెంచా.
  13. తాజా క్రీమ్ 5 చెంచాలు.
  14. శాండ్విచ్ కోసం....బ్రౌన్ బ్రెడ్ ముక్కలు 6
  15. ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు 1 కప్పు
  16. క్యాబేజీ సన్నగా పొడవుగా తరిగినది..1 కప్పు
  17. అలాగే కేరేట్ తరుగు 1 కప్పు
  18. అలాగే క్యాప్సికం తరుగు 1 కప్పు
  19. క్రీమ్ చీజ్ 1 కప్పు
  20. మిరియాల పొడి అర చెంచా
  21. ఉప్పు కొద్దిగా.
  22. మ్యాగీ గార్లిక్ చిల్లి సాస్.1 కప్పు.
  23. బట్టర్ బ్రెడ్ మీదకు చాలినంత.

సూచనలు

  1. పాను పెట్టి కొద్దిగా ఆలివ్ నూని, కొద్దిగా బట్టర్ వేసి వేడిచేసి దాల్చిన చెక్క,బిర్యానీ ఆకు వేసి అరనిమిషం వేయించాలి.
  2. ఇప్పుడు వరుసగా ఉల్లిపాయముక్కలు,కారం,వెల్లుల్లి,సెలరీ, కేరేట్,వేసి 3 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు బ్రోకలీ ముక్కలు కూడా వేసి వేయించి బాగా మగ్గిన తరువాత అందులో లీటర్(నేను కార్న్ ఉడికించిన నీళ్లు తీసుకున్నాను) నీళ్లు పోసి పావుగంట సేపు మూతపెట్టి బాగా మరిగిన తరువాత కొద్దిగా దిల్ ఆకులు వేసి మూత పెట్టి దించి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  3. ఈ లోగా శాండ్విచ్ కి కోసం తరిగిన కూర ముక్కలు అన్నీ ఒక గిన్నీలోకి వేసి ఉప్పు మిరియాలపొడి,మ్యాగీ గార్లిక్ చిల్లి సాస్ అన్ని బాగా కలిపి ఉంచాలి.
  4. ఇప్పుడు బ్రెడ్ ముక్కలను తీసుకొని దానిమీద క్రీమ్ చీజ్ రాసి,కలిపిన కూరల మిశ్రమాన్ని కొద్దిగా వేసి, ఇంకో బ్రెడ్ ముక్కను పెట్టి దాని మీదకూడా చీజ్ రాసి మళ్ళీ కూర మిశ్రమాన్ని పెట్టి చివరిగా ఇంకో బ్రెడ్ ముక్కుతో కప్పి ఉంచాలి.ఇది ఒక సెట్ అన్న మాట.
  5. ఇప్పుడు మళ్లీ ఇంకో 3 బ్రెడ్ ముక్కలతో పైన చెప్పిన విధంగా ఇంకో శాండ్విచ్ సెట్ ని కూడా సిద్ధం చేసుకోవాలి.
  6. ఇప్పుడు ఎలక్ట్రిక్ శాండ్విచ్ మేకర్ ఆన్ చేసి ఆ ప్లేట్ మీద బటర్ రాసి, ఆ బటర్ మీద సిద్ధం చేసిన బ్రేడ్ ముక్కల దొంతరను పెట్టి పైన కాస్త బట్టర్ రాసి మూతపెట్టి లాక్ చేస్తే...6..7 నిమిషాల్లో శాండ్విచ్ చక్కగా కాలుతుంది.
  7. ఇప్పుడు సూప్ దగ్గరికి వద్దాం.ఇందాక దించి పక్కన పెట్టిన కూరముక్కలు కొద్దిగా వేడి తగ్గి ఉంటాయి ఇప్పుడు అందులో ఉన్న బిర్యానీ ఆకు మరియు చెక్కలను తీసేసి మిగతవాటి అన్నిటినీ కలిపి ఒక హాండ్ బ్లెండర్ సాయంతో ఆముక్కలు అన్ని పేస్ట్ లా చెయ్యాలి నీళ్లు తీసేయ్యకూడదు.మిక్సీలో కూడా చేసుకోవచ్చు.
  8. ఇప్పుడు ఇలా మిక్సీ వేసిన సూప్ ని ఒక మూకుడులో వేసి పొయ్యిమీదపెట్టి కాస్త బటర్ వేసి బాగా వేడిచెయ్యాలి. 2 నిమిషాలు కాగిన తరువాత దించి తాజా క్రీమ్ ని బాగా కలిపి బౌల్ లోకి తీసుకోవాలి.
  9. ఈ పాటికి శాండ్విచ్ బాగా కుక్ అయివుంటుంది కదా.
  10. కాలిన బ్రెడ్ లను బయటకి తీసి త్రిభుజం ఆకారంలో కత్తిరించి ప్లేటులో పెట్టి బ్రోకలీ సూప్ బౌల్ కూడా పెట్టి సూప్ లో పుదీనా ఆకులు కాస్త క్రీమ్ వేసి అలంకరించి వడ్డిస్తే యే పిల్లలు మాత్రం కాదంటారు చెప్పండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర