హోమ్ / వంటకాలు / రెస్టారెంట్ స్టైల్ క్ఱిస్పీ కార్న్

Photo of Restaurant style crispy corn  by Sridevi Vedantham at BetterButter
359
6
0.0(0)
0

రెస్టారెంట్ స్టైల్ క్ఱిస్పీ కార్న్

Jan-05-2019
Sridevi Vedantham
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెస్టారెంట్ స్టైల్ క్ఱిస్పీ కార్న్ రెసిపీ గురించి

పిల్లలు ఎప్పుడు రెస్టారెంట్ కి వెళ్లిన క్ఱిస్పీ కార్న్ ఆర్డర్ చెయ్యమని గోల చేస్తారు, అందుకే నేను ఇంట్లో ప్రయత్నించాను. చాల బాగా కుదిరింది:blush:

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అమెరికన్ స్వీట్ కార్న్ - 2 కప్పులు
  2. మొక్క జొన్న పిండి - 2 టేబుల్ స్పూన్లు
  3. బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు
  4. ఉప్పు - తగినంత
  5. కారం - 1/2 టీ స్పూను
  6. చాట్ మసాలా - 1/2 టీ స్పూను
  7. మిరియాల పొడి - 1/2 టీ స్పూను
  8. జీర పొడి - 1/2 టీ స్పూను
  9. ఉల్లిపాయలు - 2
  10. కొత్తిమీర - 1/4 కట్ట
  11. నూనె - 1/2 లీటరు
  12. నిమ్మకాయ 1/2 చెక్క

సూచనలు

  1. ముందుగా 1/2 లీటరు నీళ్ళల్లో స్వీట్ కార్న్ 3 నిమిషాల పాటు ఉడికించాలి
  2. ఉల్లిపాయలు, కొత్తిమీర సన్నగా తరిగి ఉంచాలి.
  3. ఒక కప్ లో మసాలా పొడులు, ఉప్పు అన్నీ కలిపి ఉంచాలి.
  4. స్టవ్ పై పాన్ పెట్టి నూనె పోసి కాగనివ్వాలి.
  5. స్వీట్ కార్న్ వడపోసి, చల్ల నీళ్ళతో ఒకసారి కడిగి పెట్టాలి.
  6. ఒక బౌల్ లో ఉడికిన స్వీట్ కార్న్ లో కార్న్ ఫ్లోర్, బియ్యప్పిండి వేసి బాగా కలిపి, చిల్లులు ఉన్న గిన్నె లో వేసి అదనంగా ఉన్న పిండి తీసేయాలి.( పిక్ లో ఉన్నట్టుగా చేయాలి)
  7. కాగుతున్న నూనెలో కొద్ది కొద్దిగా పై మిశ్రమాన్ని వేసి 3 నించి నాలుగు నిమిషాల పాటు బంగారు రంగు వచ్చే వరకు, పిక్ లో చూపించిన విధంగా వేయించాలి, మొదటి ఒక నిమిషం పాటు తప్పని సరిగా మూత పెట్టి వేగనివ్వాలి(కాని గాలి కొంత బయటకి పోయే లాగ మూత పెట్టాలి), లేకపోతె కార్న్ పేలే అవకాశం ఉంది.
  8. ఇప్పుడు ఒక బౌల్ లోకి వేయించిన కార్న్, ఉల్లి ముక్కలు, కొత్తిమీర, మసాలా మిశ్రమం అన్నీ కలిపాలి.
  9. అర చెక్క నిమ్మ రసం పిండి, సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర