హోమ్ / వంటకాలు / బట్టర్ నాన్

Photo of Butter naan by Kavitha Perumareddy at BetterButter
901
9
0.0(0)
0

బట్టర్ నాన్

Jan-06-2019
Kavitha Perumareddy
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బట్టర్ నాన్ రెసిపీ గురించి

ఈ రోటీలు ఇలా చేసుకుంటే రెస్టారెంట్ లాగా వస్తాయి .తందూరి స్టైల్ లో వస్తాయి.ఈ రోటీలు పన్నీర్ బటర్ మసాలా,బటర్ చికెన్ ఇలా ఏ గ్రేవీలో ఐనా తినడానికి బాగుంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • రాత్రి విందు
  • ఉత్తర భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా పిండి పావుకిలో
  2. వెన్న ఒక చిన్న కప్
  3. పెరుగు ఒక కప్
  4. బేకింగ్ ఫావడర్ సగం స్పున్
  5. చెక్కర 2 స్పూన్స్
  6. ఉప్పు చిటికెడు
  7. నూనె 4 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి,చెక్కర,బేకింగ్ ఫావడర్,వెన్న ,ఉప్పు,పెరుగు వేసుకుని బాగా కలపాలి తరువాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చెపాతి పిండి కన్నా కొద్దిగా లూజుగా కలుపుకోవాలి. తరువాత ఈ పిండి ముద్ద పైన కొద్దిగా నూనె రాసి తడి బట్ట కప్పి గంటసేపు నాననివ్వాలి.
  2. తరువాత పిండి బాగా మెత్తగా అయ్యే వరకు ఇంకొద్దిగా నూనె వేసి బాగా మర్దనా చేయాలి.పిండిని సమాన భాగాలుగా ఉండలు చేసుకోవాలి.తడి బట్ట కప్పి ఉంచాలి.
  3. ఇప్పుడు పోయిమీద పెంనం పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక ఉండను తీసుకొని చేపతిలా ఒత్తుకోవాలి.ఒక వైపు నీళ్లు రాసి ఆవైపు పెనం మీద వేయాలి .అప్పుడు అది పెనం కు కరుచుకుని ఉంటుంది. నాన్ కొద్దిగా పొంగుతున్నప్పుడు పెనం ను తిప్పి నాన్ కు నేరుగా మంట తగిలేలా ఉంచాలి .అప్పుడు తందూరి నాన్ లా కాలుతుంది.
  4. తరువాత ఒక ప్లేట్ లో తీసుకొని పైన అంతా బాగా వెన్న పూసుకోవాలి.ఇలా అన్ని చేసుకోవాలి.
  5. ఇలా చేసుకుంటే రెస్టారెంట్ లో లాగా చాలా మెత్తగా బాగుంటాయి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర