హోమ్ / వంటకాలు / థాలీ పీఠ్

Photo of Thali peeth by Aparna Reddy at BetterButter
615
8
0.0(0)
0

థాలీ పీఠ్

Jan-08-2019
Aparna Reddy
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

థాలీ పీఠ్ రెసిపీ గురించి

థాలీ పీఠ్ మహారాష్ట్ర లో ఎక్కవగా చేసుకొంటూ ఉంటారు.అన్ని రకముల పిండులు కలిపి ఉండడం వలన న్యూట్రిషన్స్ ఎక్కగా ఉంటాయి.పిల్లలు, పెద్డలు ఇష్టపడే స్నాక్ .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • మహారాష్ట్ర
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1 చిన్న కప్ గోధుమ పిండి
  2. 1/4కప్ జొన్న పిండి
  3. 1/4 కప్ సజ్జ పిండి
  4. 1/4 కప్ రాగి పిండి
  5. 1/4 కప్ సేనగ పిండి
  6. 1 /2 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు
  7. 1/2 కప్ కీరా దోసాకాయ తురుము
  8. 1/4 కప్ సన్నగా తరిగిన కొత్తిమీర
  9. 1 చెంచా నువ్వులు
  10. 2 చెంచాల కారం
  11. 1/4చెంచా పసుపు
  12. ఉప్పు తగినంత
  13. 1/4 చెంచా వాము
  14. నూనె

సూచనలు

  1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండిని వేసుకోవలెను.
  2. తరువాత మిగిన అన్ని రకముల పిండులను వేసుకోవలెను.
  3. ఇప్పుడు ఉప్పు,కారం. పసుపు,నువ్వులు,వాము,వేసుకోవలెను
  4. తరువాత ఉల్లిపాయ తరుగు,కీరదోసకాయ తురుము,కొత్తిమీర వేసుకోవలెను
  5. చేతి తో అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి
  6. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని ముద్దగా చేసుకోవలెను.1 చెంచా నూనె వేసుకునే పిండిని బాగా మృదువుగా చేసుకోవలెను.
  7. పిండి ముద్దను మూత పెట్టుకొని 10 నిమిషములు పక్కన పెట్టుకోవాలి
  8. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొనిసన్నని సెగమీద పెట్టుకోవాలి
  9. బట్టర్ పేపర్ తీసుకొని పిండి ని చిన్న ఉండగా చేసుకొని చేతి వేళ్ళతో తో పలుచగా రోటీ లా వత్తుకోవాలి.
  10. ఇప్పుడు రోటిని పెనం మీద వేసుకొని కొంచెం నూనె /నెయ్యి వేసుకొని రెండువైపుల దోరగా వేయించుకోవాలి.
  11. అంతే ఎంతో రుచిగా ఉండే థాలీ పీఠ్ తయారు అయింది.దీనిని పెరుగుతో కానీ మనకు నచ్చిన ఉరగాయలతో కానీ తీసికోవచ్చును.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర