హోమ్ / వంటకాలు / హాండ్వో..

Photo of HANDVO by Shobha.. Vrudhulla at BetterButter
294
3
0.0(0)
0

హాండ్వో..

Jan-08-2019
Shobha.. Vrudhulla
30 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హాండ్వో.. రెసిపీ గురించి

ఇది గుజరాతీ టిఫిన్. చాలా రుచిగా సాఫ్ట్ గా కూడా ఉంటుంది.ఇంకా చాలా పౌష్టికమయిన ఆహారము కూడా.ఇందులో పప్పులు,బియ్యము,.కూరగాయలు ఈ 3 రకాలు ఉపయోగిస్తాము కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • టిఫిన్ వంటకములు
 • గుజరాత్
 • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
 • అల్పాహారం మరియు బ్రంచ్
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. బియ్యము 2 కప్పులు
 2. పెసరపప్పు అర కప్పు
 3. మినగపప్పు అర కప్పు
 4. శనగపప్పు అరకప్పు
 5. పుల్లాటి పెరుగు ఒకకప్పు
 6. నూనె 4tbsp
 7. అల్లం పచ్చిమిర్చి ముద్ద 1tbsp
 8. ఉప్పు తగినంత
 9. కారము పొడి 1tbsp
 10. పసుపు 1/4tsp
 11. క్యాబేజీ కొరినది 2tbsp
 12. ఆనపకాయ కోరు పిండేసి నీరు తీసేయవలెను 2tbsp
 13. క్యారెట్ కోరు 2tbsp
 14. ఆవాలు 1tsp
 15. ఇంగువ చిటికెడు
 16. కరివేపాకు 6 to 10
 17. నువ్వులపప్పు 1tbsp
 18. ఎండు మిరపకాయలు 2 ముక్కలు చేసిపెట్టు కోవలెను

సూచనలు

 1. ముందుగా బియ్యము పప్పులు కలిపి ఆడించి పిండి చేసి పెట్టుకోవలెను.ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోడానికి సులువుగా.
 2. ఇప్పుడు 2 కప్పుల పిండిని ఒక బౌల్ లో తీసి అందులో పుల్లటి పెరుగు, 2tbsp నూనె మరియు కొంచెం వేడి నీళ్లు పోసి కలిపి ఇడ్లి ముద్దలా తయారు చేసి రాత్రంతా ఉంచాలి ఊరటం కోసము.పిండి ఊరితే చాలా బాగా వస్తుంది
 3. అలా ఉంచిన తరువాత అందులో అల్లం పచ్చిమిర్చి ముద్ద,కారము పొడి,పసుపు ,ఉప్పు,ఆనపకాయ కోరు,బుట్ట కోరు,ఉల్లిపాయ ముక్కలు,క్యారెట్ కోరు వేసి అన్ని బాగా కలిసేలా కలపాలి.
 4. ఇప్పుడు గ్యాస్ వెలిగించి పోపు వేయించుకోవాలి ఆవాలు, జీలకర్ర,ఇంగువ వేసి వేగుతుండగా అందులో కరివేపాకు , ఎండు మిరపకాయలు వేసి అవికూడా వేగాక అప్పుడు నువ్వుపప్పు కూడా వేసి వేగాక ఈ మిశ్రములో వేసి బాగా కలపాలి.
 5. ఇది 2 3 రకాలుగా చేయొచ్చు 1 : పెనం మీద ఉతప్పం ల నూనె బాగా వేసి దుక్కగా స్టవ్ కి సీమలో పెట్టి చేయ వచ్చును నేను ఇలాగే చేసాను.
 6. పెనం మీద చేసినది ఈ పైన ఉన్న ఫోటో
 7. 2 దీన్ని ఒవేన్ లో కూడాచేయొచ్చు. ప్రిహీట్ ఒవేన్ లో 200 డిగ్రీల సెలీసియస్ వద్ద 25 నుండి 30 నిమిషాలు బేక్ చేసుకోవాలి .
 8. 3 : కుక్కర్ లో పెట్టి బెక్ లా కూడా చేయొచ్చును.
 9. అంతే ఎంతో రుచిగా ఉండే హాండ్వో తయారు.దీన్ని ఏదైనా పచ్చడితో కానీ కొత్తిమీర చట్నీ తో కానీ తింటే బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర