హోమ్ / వంటకాలు / చకినాలు

Photo of Chakinalu by kalyani shastrula at BetterButter
1509
5
0.0(0)
0

చకినాలు

Jan-10-2019
kalyani shastrula
360 నిమిషాలు
వండినది?
120 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చకినాలు రెసిపీ గురించి

తడిబియ్యంపిండితో చేసే తెలంగాణ సాంప్రదాయ వంట

రెసిపీ ట్యాగ్

  • తెలంగాణ
  • వేయించేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. ఒక కిలో పాత బియ్యం (దొడ్డు బియ్యం)
  2. దాదాపు పావుకిలో నువ్వులు
  3. నాలుగు స్పూన్ ల ఉప్పు
  4. 8 స్పూన్స్ వాము (ఓమ)
  5. గోలించడానికి సరిపడా నూనె

సూచనలు

  1. ముందుగా రెండు గంటలులేదా నాలుగు గంటలు బియ్యాన్ని నానబెట్టి ఉంచుకోవాలి
  2. నానిన బియ్యాన్ని వడకట్టి నీరంతా పోయేవరకు అరగంట పక్కన పెట్టాలి
  3. 5నిమిషాలు ఆరనివ్వాలి
  4. తడిబియ్యాని పిండి పట్టుకోవాలి .తడిపిండి సిద్దమవుతుంది
  5. ఈ పిండిలో ఉప్పు ,వాము ,నువ్వులు వేసి బాగా కలపాలి
  6. బాగా కలిపాక కొంచెం నీళ్లు పోసి మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి
  7. ఇప్పుడు ఒక కాటన్ క్లోత్ నేలమీద పరచి మొదలు పిండిముద్దతో గౌరమ్మను చేసి ,పిండిని చేతిలో పట్టుకొని వేళ్లతోనే తిప్పుతూ చుట్టు ఏడు చుట్లు చుట్టాలి .
  8. ఇప్పుడు బట్టనిండా పిండి మొత్తాన్ని చకినాలు వలె చుట్టుకోవాలి
  9. మొత్తం చుట్టడం అయ్యాక ఇనుప మూకుడులో నిండా నూనె పోసి కాగనివ్వాలి
  10. ఈలోపు ఒక ప్లేట్ మీద ఆరిన చకినాలను (మరీ పచ్చిగా ఉండవద్దు .అలాగని ఎక్కువగా అరకూడదు)నెమ్మదిగా అట్లకాడతో తీసి ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి .
  11. వీటిని బాగా కాగుతున్న నూనెలో వేయాలి .మంట పెద్దగానే ఉండాలి
  12. రెండువైపులా బాగా కాలిన చకినాలను ఒక ఇనుప సీకు తో తీయాలి .
  13. ఇంకొక వాయ నూనెలో వేసి గోలించాలి .వీటికి నూనె ఎక్కువగా పట్టదు .
  14. ఇప్పుడు తయారయిన ఎంతో రుచికరమైన చకినాలు రేగు అవతో కాని ఉల్లి కారం తో గాని తింటే చాలా బాగుంటాయి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర