హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం,పండుమిర్చి కారంబిళ్ళలు

Photo of Sabudana chekkalu by kalyani shastrula at BetterButter
583
3
0.0(0)
0

సగ్గుబియ్యం,పండుమిర్చి కారంబిళ్ళలు

Jan-11-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం,పండుమిర్చి కారంబిళ్ళలు రెసిపీ గురించి

పండుమిర్చి సగ్గుబియ్యం ఉపయోగించి చేసే బియ్యంపిండి వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • వేయించేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. నానబెట్టిన సాబుదానా రెండు కప్పులు
  2. నానబెట్టిన బొబ్బర్లు /పల్లీలు ఒక కప్పు
  3. జిలకర రెండు స్పూన్స్
  4. తగినంత ఉప్పు
  5. పండుమిర్చి పది
  6. చిన్న ముక్క అల్లం
  7. మూడు కప్పుల బియ్యం పిండి
  8. చెంచా పసుపు ,ఇంగువ ,
  9. చిటికెడు ధనియా పొడి ,
  10. పావు కప్పు నువ్వులు
  11. కరివేపాకు తరుగు
  12. వెన్న రెండు స్పూన్స్
  13. గోలించడానికి తగినంత నూనె

సూచనలు

  1. మెదలు సగ్గుబియ్యం బాగా నానబెట్టుకొని ఉంచుకోవాలి
  2. బొబ్బెర పప్పు కూడా నానబెట్టి పెట్టుకోవాలి లేదంటే పల్లీలు వేయించి కచ్చాపచ్చ చేసి వాడుకోవచ్చు
  3. పండుమిర్చి అల్లం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి
  4. ఇప్పుడు బియ్యం పిండిలో పండుమిర్చి పేస్ట్ ,ఉప్పు ,నువ్వులు ,ధనియా పొడి ,పసుపు ,ఇంగువ ,వెన్న ,బొబ్బర్ల పప్పు లేదా పల్లీలు ,నానబెట్టిన సగ్గుబియ్యం,వేసుకుంటే కొద్దిగా వేడినూనె /నెయ్యి కూడా వేసు బాగా కలుపుకోవాలి
  5. అన్నీ వేసి ఉంచిన బియ్యం పిండి
  6. మొత్తం ఒకసారి బాగా కలిపాక
  7. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతి పిండిలా కలుపుకోవాలి
  8. పిండిని ఉండలు చేసి పెట్టుకోవాలి
  9. పూరీ ప్రెస్ మీద పిండి ముద్ద పెట్టి ఒత్తుకోవాలి
  10. వీటిని కాగుతున్న నూనెలో వాళ్ళు వేసి గోలించుకోవాలి
  11. రెండువైపులా కాగాక సీకుతో తీసి పెట్టుకుంటే నూనె ఉంటే కారిపోతుంది
  12. ఇప్పుడు ఎంతో క్రిస్పీ గా ఉండే సగ్గుబియ్యం కారంబిళ్ళలు /చెక్కలు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర